టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తూనే కౌంటర్ ఎటాక్ దిగారు మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు నా నియోజకవర్గానికి వెళ్ళి… నేను వ్యక్తిగతంగా పనికి మాలిన వ్యక్తి అన్నట్లు మాట్లాడాడరు.. పనికి మాలినతనానికి చంద్రబాబుదే పేటెంట్ హక్కు అని.. ప్రపంచంలో చంద్రబాబు కంటే పనికి మాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? రాష్ట్రానికి సంబంధించి ఒక్కటైనా పనికి వచ్చే విషయం మాట్లాడారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, ఏపీ సర్కార్-బైజూస్ ఒప్పందంపై చంద్రబాబు చేసిన కామెంట్లుకు కౌంటర్ ఇచ్చిన బొత్స.. బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో.. హెరిటేజ్ జ్యూసో అనుకున్నావా..? తెలియకపోతే నీ మనవడిని అడుగు చెబుతాడు అని సూచించారు.
Read Also: Viral: కూతురు పెళ్లికి వచ్చిన చనిపోయిన నాన్న..! కన్నీళ్లు ఆగవు అంతే..!
ఇంగ్లీష్ మీడియం మమ్మీ, డాడీ కోసమా అంటున్నావు… నీ కొడుకును అందుకేనా ఇంగ్లీష్ మీడియంలో చదివించావు..? విదేశాలకు పంపావు..? అంటూ చంద్రబాబును నిలదీశారు మంత్రి బొత్స.. పేద పిల్లలకు అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలని బైజూస్ తో ఒప్పందం చేసుకుంటే తేలిక చేసి మాట్లాడతావా? అంటూ విరుచుకుపడ్డారు.. బైజూస్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం తప్పని ప్రపంచంలో ఎవరైనా ఒకరితో చెప్పించు అని సవాల్ విసిరారు. 35 లక్షల మంది విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ ఇవ్వటానికి బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నామని స్పష్టం చేసిన ఆయన.. చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సామాజిక న్యాయం మీద చర్చకు మేం కూడా సిద్ధమే.. చంద్రబాబు వస్తాడా… ఆయన తాబేదారులు వస్తారా..? అంటూ ఛాలెంజ్ విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ.