పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే వ్యాట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు లోకేష్ ఆరోపించారు. ఇకనైనా వ్యాట్ తగ్గించి బాదుడే బాదుడిని ఆపాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై భారాలు తగ్గిస్తుంటే ఏపీలో ఒక్కసారి…
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం హర్షణీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఓ లేఖ విడుదల చేశారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని పవన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లే కారణమని.. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసరాల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. పీఎమ్ ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై…
ఏపీ సీఎం జగన్ దావోస్ టూర్‌పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండటాన్ని మంత్రి జోగి రమేష్ ఖండించారు. టీడీపీ విధానాలు చూసి రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి పనికిమాలిన వాళ్లను 14 ఏళ్లు ఎలా భరించామా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారని జోగి రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రపంచ ఆర్ధిక సదస్సుకు వెళ్లటం నేరమా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులతో సీఎం జగన్ దావోస్‌కు వెళ్లడం టీడీపీ…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో యువకుడి మృతదేహం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. గతంలో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కారులో తీసుకెళ్లిన అనంతబాబు.. ఆ తర్వాత డెడ్‌బాడీతో తిరిగి వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని.. అతడి కుటుంబసభ్యులకు తెలిపారు.. వారు ఆందోళనతో డెడ్‌బాడీతో పాటు కారు కూడా అక్కడే వదిలి వెళ్లిపోయిన విషయం విదితమే.. అయితే, ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు చేశామని.. వెంటనే అరెస్ట్ చేస్తామని…
ఏపీ సీఎం జగన్ శనివారం రాత్రి దావోస్ చేరుకున్నారు. ఆయన వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. రేపు డబ్ల్యూఈఎఫ్‌తో జగన్ కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ సదస్సు తొలిరోజు పలువురితో జగన్ సమావేశం కానున్నారు. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో ఏపీ రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడనుంది. నూతన…
కర్నూలు జిల్లా పర్యటనలో ఓర్వకల్లులోని రాక్ గార్డెన్‌ను మంత్రి రోజా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో రాతి రెస్టారెంట్, బోటింగ్, కేవ్ మ్యూజియం, పిక్నిక్ స్థలాలు, వసతి కోసం హరిత రిసార్టు పర్యాటకులకు అందిస్తున్నామన్నారు. ఇది పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. మరోవైపు ప్రతిపక్షం టీడీపీపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పచ్చకామెర్లు ఉన్నాయని.. అందుకే ఆయనకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందని రోజా సెటైర్ వేశారు.…
కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో లీటర్ పెట్రోలుపై రూ.9.50, లీటర్ డీజిల్‌పై రూ.7 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49గా ఉండగా.. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.120, లీటర్ డీజిల్ రూ.105.65గా ఉన్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ.110కి దిగివచ్చే అవకాశముంది. అటు లీటర్ డీజిల్ ధర రూ.100…
ఏపీలో జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ క్రాప్ నమోదు పేరుతో జగన్ సర్కారు రైతులను దారుణంగా దోచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇది రైతులను దోచుకుంటున్న ప్రభుత్వం అని.. అన్నదాతల ఆగ్రహానికి సీఎం జగన్ బలికాక తప్పదని ఆలపాటి రాజా హెచ్చరించారు. భూమి, పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయకుండా ధాన్యం కొనుగోళ్లలో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 శాతం భూమికి…
కాకినాడ జీజీహెచ్ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం కేసు మరింత జఠిలంగా మారింది. సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. అయితే పోస్టుమార్టం జరిగితే తప్ప ఈ కేసు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. తొలుత భార్య అంగీకారంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించినా అనంతరం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బలవంతంగా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం సుబ్రమణ్యం భార్య కూడా…
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. కీలక స్పిల్ వే నిర్మాణం పూర్తయినట్లు ఈ ప్రాజెక్టు పనులను చేపట్టిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు, అదేవిధంగా 98 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పనులు సైతం పూర్తయ్యాయి. గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్ల ఏర్పాటు పనులు,10 రివర్ స్లూయిజ్ గేట్ల ఏర్పాటుతో పాటు…