Hyderabad Gas Shortage: గ్యాస్ కొరత.. హైదరాబాద్‌లో కట్టెలకు అమాంతం పెరిగిన డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Gas Shortage: ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. దీంతో క్రూడాయిల్ ఎగుమతులు, దిగుమతులపై భారీ ప్రభావం పడింది.. పెట్రో, గ్యాస్ కు కొరత ఏర్పడుతుంది.. అయితే, ముఖ్యంగా భారత్‌లో కమర్షియల్ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది.. వంట గ్యాస్ పంపిణీకి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. హోటళ్లకు మాత్రం సరఫరా తగ్గించింది.. అయితే, హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని అనేక హోటళ్లు, హాస్టళ్ల కిచెన్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు ఇప్పుడు కట్టెల పొయ్యిలపై ఆధారపడుతున్నారు. దీంతో నగరంలో కట్టెలకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరిగింది.
భారీగా పెరిగిన కట్టెల అమ్మకాలు
కట్టెల మండి నిర్వాహకుల ప్రకారం, మొన్నటి వరకు రోజుకు సుమారు 5 నుంచి 10 క్వింటాళ్ల (500 కిలో నుంచి వెయ్యి కిలోలు) వరకు మాత్రమే కట్టెలు అమ్ముడయ్యేవి. అయితే, గత రెండు మూడు రోజులుగా డిమాండ్ అమాంతం పెరిగి రోజుకు సుమారు ఐదు టన్నుల వరకు (5 వేల కిలోలు) కట్టెలు అమ్ముడవుతున్నాయని కట్టెల మండి నిర్వాహకులు చెబుతున్నారు.. ఈ డిమాండ్ ఇలాగే కొనసాగితే మరో మూడు నాలుగు రోజుల్లో కట్టెల నిల్వలు కూడా పూర్తిగా అయిపోయే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక, గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో గత నాలుగు రోజులుగా కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నామని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కట్టెలతో వంట చేయడం వల్ల అన్ని రకాల వంటకాలు తయారు చేయడం కష్టంగా మారిందని, దీంతో వ్యాపారం కూడా తగ్గిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!