చంద్రబాబు నన్ను బలిపశువును చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీద మస్తాన్ రావు.. ఏపీలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన సీఎం వైఎస్ జగన్.. బీద మస్తాన్ రావుకు కూడా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్ రావు… పెద్దల సభకు ముఖ్యమంత్రి జగన్ నన్ను పంపించటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.. జాతీయ స్థాయిలో వెళ్లటం అరుదైన అవకాశంగా…
టీడీపీలో పనిచేసిన బీసీ నేతలే సీఎం జగన్కు దిక్కయ్యారంటూ ఎద్దేవా చేశారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల్ని ప్రజలు తరిమికొడుతున్నందుకే కొత్తగా బీసీ మంత్రుల బస్సు యాత్ర అంటున్నారు.. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి వస్తున్న స్పందనతో జగన్ బీసీ జపం అందుకున్నారని సెటైర్లు వేశారు. ఆర్.కృష్ణయ్య బీసీల కోసం పోరాటాలు చేశారా లేక తన పదవుల కోసం పోరాటం చేశారా..? అని ప్రశ్నించిన ఆయన..…
తూర్పుగోదావరి జిల్లాలోని బెంగపూడి విద్యార్థుల ప్రతిభకు ఫిదా అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి… తనను కలవటానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.. దీంతో, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఐదుగురు విద్యార్థులు, ఇంగ్లీష్ టీచర్.. విద్యార్థులతో సంభాషించి వారిని అభినందించనున్నారు సీఎం వైఎస్ జగన్.. కాగా, బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల భాషా నైపుణ్యం ఇప్పుడు ఖండాంతరాలు దాటింది.. బెండపూడి పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది.. ఓ మారుమూల గ్రామంలోని పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులు ఏకాంగా అమెరికా…
క్విట్ చంద్రబాబు… సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవారయులు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా… కడప వేదికగా అభివృద్ధి, సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.. కడపలో చంద్రబాబు చేసిన విమర్శలు హస్యాస్పదమన్న ఆమె.. కుప్పంలో జరిగిన అభివృద్ది, పులివేందులలో జరిగిన అభివృద్దిని పరిశీలించాలని…
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం వైఖరిపై మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ మౌనం రైతులకు శాపంగా మారిందని.. ఇప్పటికైనా సీఎం జగన్ నోరు విప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. జోకర్ లాంటి జలవనరుల మంత్రి అంబటి రాంబాబుతో పిచ్చి మాటలు మాట్లాడిస్తే సరిపోదన్నారు. చంద్రబాబు, దేవినేని ఉమాని తిడితే పోలవరం పూర్తికాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సీఎం జగన్ మూర్ఖత్వం, డబ్బు వ్యామోహం, తెలివి తక్కువతనం, అవగాహనారాహిత్యమే…
కొన్నిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన కడప జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్కు కంచుకోటగా చెప్పుకునే కడపలో టీడీపీ నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. నియంత పాలన సాగిస్తున్న జగన్ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం…
కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెడతామని ప్రభుత్వం ప్రకటించడంపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కోనసీమ దళితుల ఆకాంక్ష నెరవేరిందని ఆయన అభిప్రాయపడ్డారు. కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయం అని కొనియాడారు. దళితులు, మేధావులకు సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు, కోనసీమ దళిత ప్రజాప్రతినిధులు కోరిన విషయాన్ని మంత్రి గోపాలకృష్ణ…
ఏపీలో ఈనెల 26 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు నిర్ణయించారు. ఈ మేరకు 17 మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేపట్టే బస్సు యాత్ర రూట్ మ్యాప్, సభల ఏర్పాటుపై చర్చించేందుకు సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఈనెల 26 నుంచి 29 వరకు 17 మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు బస్సు యాత్రలు నిర్వహించి…
ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ మేరకు రాజ్యసభ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, బీద మస్తాన్రావు, నిరంజన్రెడ్డి, ఆర్.కృష్ణయ్యల పేర్లను మంగళవారం నాడు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అయితే సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు వస్తుందని గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ మేరకు సీఎం జగన్ కూడా అలీని పిలిపించుకుని మాట్లాడారంటూ వార్తలు వినిపించాయి. అలీ కూడా కొన్నిసార్లు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా…