సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. వరుస ట్వీట్లతో చెలరేగిపోతున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ.. సెటైర్లు వేస్తూ ట్విట్టర్‌లో మంట పెడుతున్నారు. మరోవైపు, అదే స్థాయిలో టీడీపీ నుంచి సాయిరెడ్డి ట్వీట్లకు కౌంటర్లు కూడా పడుతున్నా.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. ఇక, తన తాజా ట్వీట్‌లో.. టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ అంటూ కొత్త అర్థం చెప్పారు సాయిరెడ్డి.. దానికి అధ్యక్షుడిగా ఒక నపుంసకుడిని పెట్టారు.. వాడికి చేతగాక ఎస్సీలు, బీసీలతో తిట్టిస్తున్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Somu Veerraju: అగ్నిపథ్ సాకు మాత్రమే.. ధ్వంసం వారి లక్ష్యం…!
మరోవైపు, మా పార్టీలో ప్రజల్లో తిరిగితే మంచి నాయకులవుతారు.. టీడీపీలో మాత్రం జనంలో మొరిగితేనే నాయకులవుతారు అంటూ మండిపడ్డారు సాయిరెడ్డి.. ఎన్టీఆర్ రోజుల్లో టీడీపీ వారు మా పార్టీని చూడండి అంటే… ఇప్పుడు చంద్రం తాతయ్య రోజుల్లో టీడీపీ నాయకులు మాది చూడండి అంటున్నారు! థూ… వీళ్ల బతుకు చెడ.. అంటూ విమర్శలు గుప్పించారు. పిచ్చి కుక్క కరిచిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపిస్తాం.. అదే టీడీపీలో అయితే చంద్రబాబు అనే పిచ్చి కుక్క కరిచిన వారిని అధికార ప్రతినిధులుగా పంపిస్తారు అంటూ ఘాటు కామెంట్లు పెట్టారు.. ఇక, రేప్ చేస్తా అంటూ పేలుతున్న అశుద్ధం గంజాయి పాత్రుడి వంటి టీడీపి వెధవలను పశువుల హాస్పిటల్ ఆవరణలో ఉండే ఇనుప చట్రంలో కట్టేసి… పశువులకు ఇచ్చే ట్రీట్‌మెంటే ఇవ్వాలి.. అంటూ అయ్యన్నపాత్రుడిని ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ. దానికి అధ్యక్షుడిగా ఒక నపుంసకుడిని పెట్టారు. వాడికి చేతగాక ఎస్సీలు, బీసీలతో తిట్టిస్తున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 18, 2022