టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన సర్కారువారిపాట ఈ మధ్యే విడుదలైంది.. మంచి వసూళ్లతో విజయవంతంగా దూసుకుపోతోంది.. అయితే, ఈ సినిమాలో.. రైతులు, సాధారణ ప్రజలు, మధ్య తరగతి వాళ్ల మీద బ్యాంకులు చూపించే ప్రతాపం.. వేల కోట్ల ఎగవేసి విదేశాలకు పారిపోయే వారి మీద చూపించదని పరోక్షంగా చూపించారు.. కొంత మంది వేలకోట్లు ఎగవేస్తే.. వాటిని సాధారణ ప్రజల నుంచే బ్యాంకులు, ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి అని ఈ సినిమా ద్వారా సందేశాన్ని అందించారు.. ఇప్పుడు…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారింది.. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్యణ్యాన్ని హత్య చేశాడంటూ అనంతబాబుపై ఆరోపణలు వస్తున్నాయి.. ఈ తరుణంలో.. సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. హత్య చేసిన అనంతబాబు.. సజ్జలను కలిశారంటూ విమర్శించిన ఆయన.. అనంతబాబును మరో 24 గంటల్లో అరెస్ట్ చేయాలి.. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హత్య చేసి 72 గంటలైతే.. ఇప్పటి వరకు అరెస్ట్…
విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు టీడీపీ నేత నారా లోకేష్.. 2020లో అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో అచ్చెన్నకు మద్దతుగా ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు లోకేష్.. అయితే, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్ పై కేసు నమోదైంది.. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.. ఆయనతో పాటు కోర్టుకు హాజరయ్యారు కొల్లు రవీంద్ర.. అయితే, లోకేష్ కోర్టుకు హాజరు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.. రహదారులు దిగ్బంధించి టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు…
విశాఖ జిల్లా మధురవాడలో వధువు సృజన మృతి కేసు మిస్టరీ వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది సృజన. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు పోలీసులు. పరవాడకు చెందిన మోహన్‌తో ఏడేళ్లుగా సృజన ప్రేమ వ్యవహారం నడుస్తోంది. సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కోరాడు మోహన్. అయితే, పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో ఇన్‌స్టాలో చాటింగ్ చేసింది సృజన. పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. పెళ్లి ఆపేందుకే సృజన విపపదార్థం…
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కలకలం సృష్టించింది.. అయితే, సుబ్రహ్మణ్యం కుటుంబానికి టీడీపీ ఆర్థిక సాయం ప్రకటించింది.. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ఇక, నిందితుల అరెస్ట్ కోసం దళిత సంఘాలతో కలిసి తదుపరి కార్యాచరణకు సిద్ధం అవుతోంది టీడీపీ. మరోవైపు, దళిత…
దావోస్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆయన.. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వరుసగా భేటీలు అవుతున్నారు.. ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు సీఎం జగన్.. ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై ఇవాళ డబ్ల్యూఈఎఫ్ పబ్లిక్ సెషన్లో మాట్లాడనున్నారు.. స్విస్ కాలమానం ప్రకారం ఉదయం 8:15ల కు సెషన్ ప్రారంభం కానుంది.. Read…
కోనసీమ జిల్లా ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు సెక్షన్ 144 అమలు చేస్తున్నట్టు ప్రకటించారు ఎస్పీ సుబ్బారెడ్డి… కోనసీమలోని అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు కొత్తపేట, కాట్రేనికొన, రావులపాలెం మండలాల్లో సెక్షన్ 144 విధించినట్టు వెల్లడించారు.. సెక్షన్ 144 అమలులో ఉన్న కారణంగా ఎటువంటి ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.. కోనసీమ జిల్లా పేరు మార్పు ఆందోళనల నేపధ్యంలో శాంతిభద్రతల కోసం 450 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు…
సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జెడ్పీ ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని వర్గాల వారికి…
అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో పేరు మార్చాలని ఆందోళనలు, నిరసనలు జరగ్గా.. ఇప్పుడు పేరు మార్చొద్దంటూ కొందరు వ్యతిరేక గళం చాటుతుండటంతో గందరగోళం నెలకొంది. Pawan Kalyan: జగన్ సర్కార్ కూడా పెట్రోల్ రేట్లను తగ్గించాలి ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి వారం రోజుల…
ఈనెల 26న అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలపై ఇందులో చర్చించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ఇతర అంశాలపై కూడా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇతర అంశాలపై కూడా చర్చిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతున్న తీరుపై…