రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై మంగళవారం మధ్యాహ్నం అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన పనులు ఎక్కడా కూడా పెండింగ్‌లో ఉండకూడదని.. వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ హితవు పలికారు. గుంతలు లేకుండా రోడ్లను తీర్చిదిద్దాలని జగన్ తెలిపారు.
నివర్ తుపానుతో కొట్టుకుపోయిన ప్రాంతాల్లో పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ వెల్లడించారు. కార్పొరేషన్లు, మున్పిపాలిటీలలో జూలై 15 కల్లా గుంతలు పూడ్చాలని సీఎం జగన్ ఆదేశించారు. జూలై 20న ఫొటో గ్యాలరీలు పెట్టాలన్నారు. పంచాయతీ రాజ్ రోడ్లకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పనులే కాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా విపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని సీఎం జగన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని కోరుకుంటున్నాయని విమర్శించారు. కేసుల ద్వారా పసులను అడ్డుకోవాలని తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒక అజెండాతో పనిచేస్తున్నాయని జగన్ మండిపడ్డారు.
Andhra Pradesh: తిరుపతి జిల్లాలో ఈనెల 23న సీఎం జగన్ పర్యటన షెడ్యూల్