ఏపీలో సినిమా టికెట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వమే టిక్కెట్లను విక్రయించనుంది. దీంతో బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తి పలకనుంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఆన్‌లైన్‌లో టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు ఏపీఎఫ్‌డీసీ పోర్టల్ యువర్ స్క్రీన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువర్ స్క్రీన్స్ పోర్టల్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ విధానంతో థియేటర్లకు ఉన్న గత ఒప్పందాలు రద్దు కావని ఏపీఎఫ్‌డీసీ ఎండీ విజయ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
కాగా సినిమా టిక్కెట్లు అందరికీ అందుబాటులో ఉండాలని కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోంది. దీని కోసం పలువురు సినీ ప్రముఖులతో సమావేశాలు కూడా నిర్వహించింది. దీంతో అనేక కసరత్తుల అనంతరం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రజలెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను ఈ పోర్టల్ ద్వారా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్ల యాజమాన్యాలు అమలు చేయాలని.. అందుకు ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని ఏపీఎఫ్‌డీసీ ఎంపీ విజయ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
TTD: కల్యాణమస్తుకు ముహూర్తం ఖరారు.. జూలై 1నుంచి దరఖాస్తుల ఆహ్వానం