కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. సోమవారం నాడు విశాఖ నార్త్ నియోజకవర్గంలో టీడీపీ మహిళా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి బూత్ లెవల్ వరకు పటిష్టంగా ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వాలంటీర్ల…
విజయవాడ కమిషనరేట్ పరిధిలో నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సత్యానందంను పటమట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అటు కమిషనరేట్‌లో ఉన్న ఎంవీ దుర్గారావును కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పటమట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డిని సిటీ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న…
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అలియాస్ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం రహస్య ప్రదేశంలో పోలీసులు అనంతబాబును విచారించారు. విచారణలో భాగంగా ఆయనకు కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కాకినాడ జిల్లా కోర్టుకు వేసవి సెలవులు కావడంతో స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి చల్లా జానకి ముందు అనంత…
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి మేరుగ నాగార్జునపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి మేరుగ నాగార్జున పేరు చివర రెడ్డి అనే పదం కనిపించడంపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి మేరుగ నాగార్జున తాను దళిత బిడ్డ అన్న విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారని వంగలపూడి అనిత సెటైర్ వేశారు. దళితుల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ…
ఏపీలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వ్యవహారం వైసీపీని ఇరుకున పెడుతోంది. తాను డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ నేరాన్ని అంగీకరించాడు. దీంతో వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు వైసీపీపై విరుచుకుపడుతున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. దావోస్‌లో ఉన్న సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు…
ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కారులో డెడ్‌బాడీ దొరికిన అంశం హాట్ టాపిక్‌గా మారింది. నిందితుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే చట్టం ముందు అందరూ సమానులేనని.. తప్పు చేసింది ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైసీపీ మంత్రులు క్లారిటీ ఇస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన…
దావోస్ వేదికగా వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సదస్సుకు ఏపీ సీఎం జగన్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కూడా ఈ సదస్సుకు హాజరైనట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దావోస్‌లోని ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హాజరైనట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో కలిసి…
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్‌భాస్కర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కారులో డ్రైవర్ డెడీబాడీ దొరకడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎమ్మెల్సీ విషయంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తారో లేదో పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. బీసీ సంఘానికి జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్య లాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తే తప్పేంటని ప్రశ్నించారు. Nara…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌కు భారీ డిమాండ్ ఉండగా.. నిమిషాల వ్యవధిలోనే అని టికెట్లు బుక్అవుతున్న విషయం తెలిసిందే.. ఇక, ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల కాబోతున్నాయి.. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కూడా రేపే విడుదల చేయనుంది…
ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారే.. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరం జిల్లా గరివిడిలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్సపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బొత్స సొంత జిల్లాలోనే రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహాన్ని శిరస్సు ఖండిస్తే దానిపై పోరాడి తిరిగి…