BJP : తెలుగు రాష్ట్రాల్లో ఆ సామజిక వర్గం బీజేపీపై ఆగ్రహంతో ఉందా.? l
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారింది. గత సంప్రదాయాలకు అనుగుణంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును రాష్ట్రపతిని చేస్తారని అంతా భావించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన్ని హుటాహుటిన ఢిల్లీ రావాలని చెప్పడం.. ఆ తర్వాత అమిత్ షా తదితరులు వెంకయ్య దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆయనే తదుపది రాష్ట్రపతి అభ్యర్థిగా అందరూ భావించారు. సంఖ్యా పరంగా ఎన్డీయేకు రాష్ట్రపతిని గెలిపించుకునే బలం ఉండటంతో.. చాలా సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి పీఠంపై తెలుగువ్యక్తి.. వెంకయ్య నాయుడు కూర్చోబోతున్నారని సంతోషించారు తెలుగు రాష్ట్రాల జనం. కానీ.. బీజేపీ మరో నిర్ణయం తీసుకుంది. సామాజిక లెక్కల పేరుతో కమలనాధులు చేసిన వడపోతలపై ముఖ్యంగా తెలుగువారితోపాటు… మరీ ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం చాలా గుర్రుగా ఉంది.
వెంకయ్య నాయుడు మొదటి నుంచీ బీజేపీలోనే ఉన్నారు. తనను తాను కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా ఎప్పుడూ చెప్పకపోయినా.. ఆ సామాజికవర్గంలో మాత్రం వెంకయ్యకు చాలా పెద్ద స్థానమే ఉంది. ఆ కోణంలోనే కమ్మ సామాజికవర్గానికి చెందిన చాలా మంది బీజేపీకి దగ్గరైన పరిస్థితి.. అలాగే ఎన్నికల్లో ఆదరించే వాతావరణం కనిపించేది. కానీ.. ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆ వర్గాన్ని తీవ్రంగా నిరాశపర్చడంతోపాటు.. కమలంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో ఆంధ్రాలోని కమ్మ సామాజికవర్గం ఒక విధంగా కుతకుతలాడుతోంటే.. తెలంగాణలోని కమ్మ సామాజికవర్గం మరో విధంగా ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ఆలోచన. ఇందుకు ప్రత్యేక ఆపరేషన్ కూడా చేపట్టింది. అయితే వెంకయ్యను రాష్ట్రపతిని చేయకపోవడంతో.. గుర్రుగా ఉన్న ఆ సామాజికవర్గం ఎన్నికల్లో బీజేపీకి ఎంత వరకు సహకరిస్తుంది అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్న.
Also Read
తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ. అలాగే రాష్ట్రంలోని మిగతా చోట్ల కూడా కొన్ని సెగ్మెంట్లలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఆ వర్గం ఓటర్లు ఉన్నారు. అలాంటి నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. స్థానికంగా ఉన్న కమలనాథులు సైతం ఈ ప్రమాదాన్ని గ్రహించి మల్ల గుల్లాలు పడుతున్నారట. ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ అగ్రనాయకత్వం కూడా గుర్తించినా.. బయట పడటానికి సంకోచిస్తోంది. డ్యామేజ్ కంట్రోల్ ఎలాగో తెలియక ఆందోళన చెందుతున్నారట నాయకులు.
రాజకీయ కోణంలో చూసినా.. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో వెంకయ్య నాయుడికి రాజకీయ పరిచయాలు ఎక్కువ. పార్టీలకు అతీతంగా ఆయన్ని గౌరవిస్తారు. ఆంధ్రా, తెలంగాణలో అయితే కమ్మ సామాజికవర్గంతోపాటు మిగతా వర్గాలు కూడా వెంకయ్య రాష్ట్రపతి అయితే చూడాలని అనుకున్నాయి. అందుకే వెంకయ్య నాయుడిని రాష్ట్రపతిని చేసుంటే.. బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సానుకూల వాతావరణం ఏర్పడేదని.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్టీ మరింత బలోపేతానికి బాట పడేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ లెక్కలేవీ పరిణనలోకి తీసుకోకుండా బీజేపీ నాయకత్వం తప్పులో కాలేసిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పైగా దేశంలో గడిచిన రెండు ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ గట్టి పట్టే సాధించింది. దక్షిణాదిలో పాగా వేయడానికి వేయని ఎత్తులు జిత్తులు లేవు. అదే వెంకయ్యను రాష్ట్రపతిని చేసి ఉంటే.. ఆంధ్రా, తెలంగాణలో కమ్మ సామాజికవర్గం నుంచి సానుకూలత వ్యక్తం కావడంతోపాటు.. రాజకీయంగా బీజేపీకి కూడా కలిసి వచ్చేదని చెబుతున్నారు. వివాదరహితుడైన వెంకయ్యను కేవలం కమ్మ సామాజికవర్గమే కాకుండా తెలుగు వారంతా ఓన్ చేసుకుంటారు. ఆ విధంగా చూసినా.. బీజేపీకి రాజకీయంగా ప్లస్సే అయ్యేదని కొందరి వాదన. కానీ.. ఒకే ఒక్క నిర్ణయం.. బీజేపీపై ఒక సామాజికవర్గం ఆగ్రహానికి.. తెలుగువారిలో అసంతృప్తికి దారితీసింది.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!