Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన ఏటీసీ టైర్స్ కంపెనీ ప్రతినిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను ఏటీసీ టైర్స్ కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలని సీఎం జగన్‌ను ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా పాల్గొన్నారు. విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టులో నూతన ప్లాంట్‌ను ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
కాగా ఏటీసీ ది యోకోహామా రబ్బర్ కో లిమిటెడ్ జపాన్‌కు పూర్తిగా అనుబంధ సంస్ధ. ఏటీసీ, ఏటీసీ అనుబంధ కంపెనీలు సంయుక్తంగా అలయెన్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ)గా ఏర్పడ్డాయి. ఆఫ్ హైవే టైర్ల (ఓహెచ్‌టీ) వ్యాపారంలో ప్రపంచంలో ఏటీజీ ప్రముఖ సంస్థగా ప్రసిద్ధి పొందింది. ఆరు ఖండాల్లోని 120 దేశాలలో ఏటీజీ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఏటీసీ భారతదేశంలో రెండు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. ఇందులో ఒకటి తిరునెల్వేలి (తమిళనాడు), మరొకటి దహేజ్ (గుజరాత్). అంతేకాకుండా ఏపీలోని విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద రూ. 1,750 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేసింది. ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీని ఏటీసీ సంస్థ కలిగి ఉంటుంది. ఈ ప్లాంట్ ద్వారా 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!