Srisailam: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద.. గేట్లు ఎత్తేది ఎప్పుడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి.. గోదావరి బేసిన్‌తో పోలీస్తే మాత్రం.. కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం కాస్త ఆలస్యంగానే ప్రారంభం అయ్యిందని చెప్పుకోవాలి.. ఇప్పుడిప్పుడే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.. కృష్ణా బేసిన్‌లోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది.. దీంతో, 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో రూపంలో లక్షా 6 వేల క్యూసెక్కుల నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుండగా.. లక్షా 7 వేల క్యూసెక్కుల నీటిని 18 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు.. పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,039.50 ఫీట్లుగా ఉంది.. పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు అయితే,, ప్రస్తుత నీటి నిల్వ 6.462 టీఎంసీలుగా ఉందని.. 3 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా.. ఎత్తి పోతల పథకాలకు కూడా నీటి విడుదల జరుగుతోంది..
Read Also: Astrology: జులై 14, గురువారం దినఫలాలు
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ఇక, జూరాల నుంచి భారీ స్థాయిలో నీటి విడుదలతో.. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద పోటెత్తుతోంది.. ఇన్ ఫ్లోగా 1,03,247 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం డ్యామ్‌ను చేరుతోంది.. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 827.80 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 47.3680 టీఎంసీలుగా ఉంది.. అయితే, శ్రీశైలం డ్యామ్ నిండడానికి మరింత సమయం పట్టనుంది.. ప్రస్తుతం 827 అగుల నీటిమట్టం మాత్రమే ఉంది.. పూర్తిస్థాయిలో డ్యామ్ నిండాలంటే 885 అడుగులకు చేరాలి.. దీంతో, ఇప్పట్లో గేట్లు ఎత్తే పరిస్థితి మాత్రం లేదు.. కృష్ణమ్మ మరింతగా పరవళ్లు తొక్కితేగాని శ్రీశైలంలో గేట్లు ఎత్తే అవకాశం లేదు.. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో.. శ్రీశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారు అని పర్యాటకులు ఎదురుచూస్తూ ఉంటారు.. గేట్లు ఎత్తినప్పుడు.. అక్కడ ఉండే వాతావరణాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు తరలిరావడం తెలిసిన విషయమే..
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!