వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఏపీ శాసనసభ వ్యవహారాల సమన్వయకర్తగా ఏపీ ప్రభుత్వం ఆయన్ను నియమించింది. అంతేకాకుండా ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ర్యాంక్ హోదాతో రెండేళ్ల పాటు శ్రీకాంత్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ఇటీవల జరిగిన క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణలో శ్రీకాంత్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ జగన్ ఆయనకు బెర్త్ కేటాయించలేదు. ఇప్పుడు మాత్రం శ్రీకాంత్‌రెడ్డిని శాసనసభ వ్యవహారాల సమన్వయకర్తగా నియమించి కేబినెట్ హోదా కల్పించడం గమనార్హం.
Read Also: Andhra Pradesh: ఏపీ సర్కారు శుభవార్త.. ఆగస్టు 1 నుంచి ఆరోగ్యశ్రీలో చికిత్సల జాబితా పెంపు