ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.. క్రమంగా గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతుండడంతో.. ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.. మరోవైపు. మరో మూడు రోజులు వర్షాలు తప్పవని వాతావరణశాఖ సూచిస్తోంది.. అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసిన తాజా నివేదికలను ఓసారి పరిశీలిస్తే.. నిన్న దక్షిణ కోస్తా ఒడిశా మరియు పరిసర ప్రాంతాల్లో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉత్తర కోస్తా, ఒడిశా మరియు పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా మారిందని.. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ పైన విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఉందని పేర్కొంది.
Read Also: Banned Words in Parliament: పార్లమెంట్ లో ఈ పదాలు నిషేధం.. వాడారో అంతే
ఇక, రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గుణ, సాగర్, జబల్‌పూర్, పెండ్రా రోడ్డు, అల్పపీడన ప్రాంత కేంద్రం ఉత్తర ఒడిశా మరియు పొరుగు ప్రాంతాల మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్లి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉందని పేర్కొంది.. తూర్పు -పడమర గాలుల కోత ఉత్తర భారత ద్వీపకల్ప మైన 19డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ మరియు 7.6 కి.మీ విస్తరించి ఉన్నదని.. దీని ప్రభావంతో రాబోవు మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉండగా.. దక్షిణ కోస్తాలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల కురుస్తాయని పేర్కొంది.. ఇక, రాయలసీమ ఈ రోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.. రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.