టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి ఆర్కే రోజా.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాదరణ కోల్పోయ్యారంటు చంద్రబాబు చెప్పడం చూస్తూంటే ఆయనకి చిన్న మెడదు చితికిందా..? అనే అనుమానం కలుగుతోందన్నారు.. ఇవాళ ఉదయం తిరుమలలో వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ఆమె.. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక, ఓవైపు కాంగ్రెస్‌కు మద్దతిస్తూనే.. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వడం విషయంలో టీడీపీపై మండిపడ్డ రోజా.. ఇది చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శం అన్నారు. అయితే, 10 రోజులకి ముందు సీఎం అయినా మహారాష్ట్ర సీఎంకు టాప్ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు అందిస్తోన్న సీఎం వైఎస్ జగన్‌కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా..
Read Also: India: 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు.. ఐఎండీ హెచ్చరిక