గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. లంక గ్రామాలను ముంచేస్తోంది.. ఇప్పటికే చాలా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి.. మరోవైపు.. గోదావరిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఆందోళన కలిగించే విషయం.. అయితే, ఇవాళ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు.. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు.. ఇక, ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించి.. వరదలు, వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్..
Read Also: Virat Kohli: కోహ్లీకి పాక్ స్టార్ బ్యాట్స్మన్ మద్దతు
గోదావరికి వస్తున్న వరదలపై ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం జగన్.. ఏరియల్ సర్వే నిర్వహించి.. ఆ తర్వాత సమీక్ష చేపట్టనున్నారు.. ఇప్పటికే రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్టుగా తెలిపారు అధికారులు.. దాదాపు 23 –24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందన్నారు.. ఆమేరకు పోలవరం వద్దా, ధవళేశ్వరం వద్దా ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తంచేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు..