* ఉదయం 11 గంటలకు దేవేంద్ర ఫద్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం, కోర్ కమిటీ సమావేశం తర్వాత దేవేంద్ర ఫద్నవీస్ ప్రెస్ మీట్
* నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు, ఉదయం 11.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
* నేటి నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం
* నేడు సాయంత్రం 6 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం, కొనసాగుతోన్న కౌంట్‌డౌన్
* శ్రీకాకుళం జిల్లా పలాసలో నేడు వైసీపీ ప్లీనరీ, హాజరుకానున్న మంత్రి సీదిరి అప్పలరాజు.
* నేడు నెల్లూరులో వైసీపీ జిల్లా ప్లీనరీ… హాజరు కానున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు
* నేడు విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం… గురజాడ కళాక్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ నాయకత్వం.. హాజరుకానున్న ఉమ్మడి విశాఖ జిల్లాల కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజని
* అనంతపురం: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు 50వ డివిజన్ అరుణోదయ కాలనీ పరిసర ప్రాంతాల్లో పర్యటించననున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.
* నంద్యాల: నేడు ఆత్మకూరులో జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణ … పాల్గొననున్న బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
* కాకినాడ: నేటి నుంచి లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారి ఆషాడమాసోత్సవాలు, వచ్చే నెల 28 వరకు జరగనున్న ఉత్సవాలు
* కాకినాడ: నేడు పెద్దాపురంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటన, టిడ్కో ఇళ్ళను ప్రారంభించనున్న మంత్రి
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి ఘనంగా ప్రారంభం అయిన ఆషాడమాసం ఉత్సవాలు, ఆషాడం సారెను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం, ఉదయం 8 గంటల లోపు అమ్మవారికి మొదటి సారెను ఇవ్వనున్న ఆలయ అర్చకులు… ఆషాడ మాసం నెలరోజుల పాటు సారెను సమర్పించే భక్తులు మూడు రోజులు ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించిన ఆలయ అధికారులు, జులై 28వ తేదీ వరకు ఆషాడమాసం సారె
* చిత్తూరు: నేడు విచారణకు రానున్న చిత్తూరు మేయరు అనురాధ దంపతుల హత్య కేసు… ఆరో అదనపు జిల్లా కోర్టు కేసులో ఉన్న సాక్షులను విచారించనుంది…
* చిత్తూరు: నేడు వైయస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం, హాజరుకానున్న ఎంపీ మిధున్ రెడ్డి, రెడెప్ప, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, రోజా, డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ.. ఇతర కీలక నేతలు… ఎమ్మెల్యేలు
* విశాఖ: నేటి నుంచి మూడు రోజుల పాటు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ పర్యటన… పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ