> నేటితో ముగియనున్న రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ గడువు
> శ్రీహరికోట: రేపు జరగనున్న పీఎస్‌ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం
> శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం పంచాయతీలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
> విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నేడు వైసీపీ ప్లీనరీ సమావేశం.. హాజరుకానున్న మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
> తిరుపతి: నేడు గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి
> తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు దోస్త్ నోటిఫికేషన్ జారీ
> చెన్నై: ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బీసెంట్ నగర్ శ్మశానవాటికలో నటి మీనా భర్త విద్యాసాగర్ అంత్యక్రియలు