Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- వందే మాతరంను అవమానిస్తే జైలే..
- వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు..
- FCRA సవరణ బిల్లును మరోసారి లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం..
- జనన, మరణాల ఆలస్య నమోదుపై కఠిన నిబంధనలకు మరో బిల్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కీలక బిల్లు తీసుకురానుంది. దీనికి సంబంధించిన జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం((FCRA) సవరణ బిల్లు-2026, జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు-2026తో పాటు మరణాల నమోదు(సవరణ)బిల్లు-2026ను సభలో ప్రవేశపెట్టనున్నారు. జూలై 20 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుల్ని ఆమోదింపచేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
వీటిలో పాటు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్(సవరణ) బిల్లు-2026, ఇన్కమ్ టాక్స్ (సవరణ) బిల్లు-2026, వికసిత్ భారత్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు-2025ను పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’, జైలులో ఉన్న ప్రజాప్రతినిధుల అధికారాలపై రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రస్తుతం అజెండాలో లేవు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
వందేమాతరాన్ని అవమానిస్తే జైలే:
జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026 బిల్లు ద్వారా జాతీయ గీతం ‘‘వందేమాతరం’’ ఆలాపనను అవమానించడం లేదా అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఇందు కోసం 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టూ నేషనల్ హానర్ యాక్ట్‌లో సవరణ చేయనుంది.
FCRA సవరణ బిల్లు:
వివాదాస్పదమైన విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026ను కూడా పరిశీలన, ఆమోదం కోసం ప్రభుత్వం జాబితాలో చేర్చిందని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టారు. కానీ పరిశీలన, ఆమోదం కోసం ముందుకు రాలేదు. ఆ సమయంలో కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఉండటం, దీనిపై ఆ రాష్ట్రంలోని కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో బిల్లు నిలిచిపోయింది. దీనిని ఇప్పుడు ఆమోదం కోసం ముందుకు తీసుకురాబోతుున్నారు.
జనన, మరణాల నమోదు నిబంధనలు కఠినతరం:
జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026 ద్వారా 1969 చట్టంలోని సెక్షన్ 13(3)లో మార్పులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఆలస్యంగా జననాలు, మరణాల నమోదుకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!