Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు
- యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- లేకపోతే 2014 సీన్ రిపీట్ అవుతుందని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువత డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలని.. లేకపోతే 2014 తరహా రాజకీయ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. 2026 నీట్-యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న యువతకు, నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘‘యువత గొంతును, ఈ ఉద్యమాన్ని, సోనం వాంగ్చుక్ను వినండి. లేకపోతే మరో మూడు సంవత్సరాల్లో 2014లో ఎదురైన పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వస్తుంది.’’ అని హెచ్చరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు సోనం వాంగ్చుక్ను దేశ విద్యాశాఖ మంత్రిగా నియమించాలని ప్రధాని మోడీకి సూచించారు. ‘‘ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి సోనం వాంగ్చుక్ను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియమించాలి. విద్యా వ్యవస్థను సంస్కరించడానికి ఆయనలాంటి వ్యక్తి అవసరం.’’ అని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
2026 నీట్-యూజీ పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్‌చుక్ జంతర్‌మంతర్ దగ్గర చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం 19వ రోజుకు చేరుకుంది. ఇదిలా ఉండగా సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిరాహార దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యాన్ని ప్రతిరోజూ వైద్యపరంగా పరీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విచారణ సందర్భంగా ‘‘ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యం. వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి.’’ అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ వైద్యుల సూచనల మేరకు అవసరమైన వైద్య చికిత్సను ఆలస్యం చేయకుండా అందించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
లడఖ్‌కు చెందిన ఇంజినీర్, విద్యా సంస్కర్త, పర్యావరణ కార్యకర్త అయిన సోనం వాంగ్‌చుక్ ప్రస్తుతం నీట్-యూజీ 2026 పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై కేంద్ర ప్రభుత్వ చర్యలను డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!