The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Odyssey: ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి సినిమా వస్తుందంటేనే సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతాయి. తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే నోలన్.. ఈసారి దాదాపు 3,000 ఏళ్ల పురాతన గ్రీకు ఇతిహాసం ‘ది ఒడిస్సీ’ని అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సుమారు మూడు గంటల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం స్టార్టింగ్ నుంచే ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెబుతున్నారు. విజువల్స్, ఎమోషన్స్, యాక్షన్, మైథాలజీ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ సినిమా హాలీవుడ్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రంలో ఒడిస్సియస్ పాత్రలో నటించిన మాట్ డామన్ తన కెరీర్లోనే అత్యుత్తమ నటనను కనబరిచారని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. యుద్ధ వీరుడిగానే కాకుండా, తప్పులు చేసే సాధారణ మనిషిగా, కుటుంబం కోసం తపించే భర్తగా, తన తెలివితేటలతో ప్రతి సవాలును ఎదుర్కొనే నాయకుడిగా ఆయన పాత్రను ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారట. ట్రోజన్ హార్స్ నుంచి తప్పించుకోవడం, సిర్సే వంటి మాయాజాలాల నుంచి తన సైన్యాన్ని రక్షించడం వంటి సన్నివేశాల్లో ఆయన నటన హైలెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక టామ్ హాలండ్ ఈ మూవీలో టెలిమాకస్ పాత్రలో పూర్తిగా కొత్త కోణంలో కనిపించనున్నారట. స్పైడర్‌మ్యాన్ ఇమేజ్‌కు భిన్నంగా, తండ్రి కోసం ఎదురు చూసే యువకుడిగా ఆయన నటన ప్రేక్షకులను కదిలిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా తన తండ్రి గురించి విన్న తర్వాత భావోద్వేగానికి గురయ్యే ఒక సన్నివేశం ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొంటున్నారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
పెనెలోప్ పాత్రలో యాన్ హాతవే తన అద్భుతమైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారని చెబుతున్నారు. భర్త కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తూనే రాజ్యాన్ని కాపాడే ధైర్యవంతురాలైన రాణిగా ఆమె భావోద్వేగాలను ఎంతో సహజంగా పలికించారని అంటున్నారు. మరోవైపు జెండయా స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ, కనిపించిన ప్రతిసారి తన ప్రత్యేకమైన ఉనికితో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టాక్. రాబర్ట్ ప్యాటిన్సన్ మరోసారి తన నటనతో ప్రత్యేక ముద్ర వేశారట. ప్రతి సన్నివేశంలో ఉత్కంఠను పెంచే పాత్రలో ఆయన ఈ చిత్రంలో కనిపించబోతున్నారట. అలాగే ఇలియట్ పేజ్, లుపిటా న్యోంగో, చార్లీజ్ థెరాన్, జాన్ బెర్న్థాల్, నిఖిల్ పటేల్ వంటి నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెబుతున్నారు. పెద్ద తారాగణం ఉన్నప్పటికీ ప్రతి పాత్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వడంలో నోలన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తే ‘ది ఒడిస్సీ’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదని.. ఒక విజువల్ గ్రాండియర్, భావోద్వేగ కథనం, అద్భుతమైన నటన, సాంకేతిక నైపుణ్యం కలిసిన అరుదైన సినిమాటిక్ అనుభవంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ మరోసారి తన డైరెక్షన్ మ్యాజిక్‌తో ప్రపంచ సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రాన్ని తెరకెక్కించారని చెబుతున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!