Satyakumar: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దసరా పండగ సందర్భంగా జాతీయ పార్టీపై ప్రకటన చేస్తానని కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ నేతలు తమకు టచ్‌లోనే ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలతో కేసీఆర్ నేరుగా మాట్లాడారని లీకులు ఇస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పందించారు. ఏపీలో ఒక్క బీజేపీ కార్యకర్తను అయినా కేసీఆర్ పెట్టబోతున్న బీఆర్ఎస్ పార్టీలోకి లాక్కోగలిగితే తన ముక్కును నేలకు రాస్తానని సవాల్ చేశారు.
Read Also: Palvai Sravanthi: 14న నామినేషన్, ప్రజలనుంచి అనూహ్య స్పందన
తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టారని.. టీడీపీలో పెరిగారని.. వైసీపీతో తోడుదొంగలా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సత్యకుమార్ ఆరోపించారు. వాళ్లతో ప్రయత్నిస్తే ఒకరో ఇద్దరో తలమాసినోళ్లు దొరక్కపోరని సత్యకుమార్ సూచించారు. కాగా ఇప్పటికే కేసీఆర్ పెట్టబోతున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ సముద్ర తీరంలో టీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు. ఈ మేరకు జై భారత్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, దేశ్ కీ నేత కేసీఆర్, కిసాన్ భరోసా అని నినాదాలు రాయించారు. అటు ఈనెల 5న దసరా సందర్భంగా ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ భేటీకి హాజరుకావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌లను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
ఏపీలో ఏ ఒక్క బిజెపి కార్యకర్తనన్నా మీరు పెట్టబోతున్న BRS (Bharata Bar & Restaurant Samiti) పార్టీలోకి లాక్కోగలిగితే ముక్కు నేలకు రాస్తాను.
మీరు పుట్టిన @INCIndia, పెరిగిన @JaiTDP, తోడుదొంగ @YSRCParty తో ట్రై చేసుకోండి. ఒకరో ఇద్దరో తలమాసినోళ్లు దొరక్కపోరు.#KCR @KTRTRS pic.twitter.com/3h2Q5H1uU4
— Satya Kumar Yadav (@satyakumar_y) October 4, 2022