Newly Married Women’s Suicides: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు..!! కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం వధువులకు.. నరకప్రాయంగా మారుతున్నాయి. పెళ్లి తర్వాత ఆ నరకంలో ఉండలేక.. కాళ్ల పారాణి ఆరక ముందే ఉసురు తీసుకుంటున్నారు. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో మరణ మృదంగం మోగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది.. పాత రేషన్ కార్డుల స్థానంలో కీలక మార్పులతో స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకురానుంది.. ఈ నెల 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని.. ఈ నెల 31వ తేదీ వరకు రేషన్ కార్డులు పంపిణీని పూర్తి చేయాలని నిర్ణయించింది.
వైఎస్ జగన్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కృష్ణాజిల్లా గుడివాడ.. గుడ్లవల్లేరులో మీడియాతో మాట్లాడిన నిమ్మల రామానాయుడు.. మామిడికాయలకు.. తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు.. వై నాట్ 175 లాంటిదే.. జగన్ 2.0 కూడా అంటూ సెటైర్లు వేశారు.
కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి కూతురు అత్త గారింట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి శాడిస్ట్ భర్తతో వేధింపులు మొదలయ్యాయి. ఆశలతో మెట్టినింట అడుగు పెట్టిన వధువుకు అనుక్షణం అవమానాలే ఎదురయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త విచక్షణ మరచి నువ్వు అందంగా లేవు. నాకు పరిచయం ఉన్న సాయి అనే అమ్మాయి అందం ముందు నీవెందుకు పనికిరావు అంటూ కొట్టి దూషించడం, అడ్డు చెప్పాల్సిన అత్తామామ అతనికి అండగా నిలబడటం చూసి తట్టుకోలేకపోయింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి.. ఇక, ఈ నెల 12వ తేదీన మిథున్రెడ్డి బెయిల్పై తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు..
P4 కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పీ4 కార్యక్రమంపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు..
రాజధాని అమరావతి అభివృద్ది చెందాలన్నదే బీజేపీ అభిమతం అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్.. గత ప్రభుత్వం అమరావతి రైతులను దగా చేసిందని విమర్శించారు... ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అమరావతి రైతులకు బీజేపీపై ఉన్న అపోహను రాజధాని జేఏసీ నేతల సమావేశంలో తీర్చేశామన్నారు.
డాక్టర్ సమరం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో జరిగిన డాక్టర్ సమరం రాసిన 218వ పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో అందరూ 60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటారు.. కానీ, 86 సంవత్సరాల వయసులో కూడా డాక్టర్ సమరం రిటైర్ కాలేదన్నారు.. వాజ్ పేయ్ కూడా రిటైర్ కాలేదు, అలసిపోలేదు అని ఒక సమావేశంలో చెప్పారని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఆరోగ్య శాఖ…