హ్యాట్రిక్ విజయాలు..., చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి...., మంచి వాగ్ధాటి, రాజకీయ వారసత్వం కలిసొచ్చి డైనమిక్ లీడర్‌గా గుర్తింపు. శ్రీకాకుళం ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడి గురించి చెప్పుకునే పాజిటివ్ మాటలివి. అన్నట్టుగానే... ఇందులో ఏదీ అసత్యం లేదు, కాదనేవాళ్ళు ఎవరూ లేరు.
యాపారం.. ఇది అలాంటిలాంటి యాపారం కాదు. అయోధ్య రామయ్యనే అంగడి సరకు చేసేసిన ఫక్తు బిజినెస్. విశాఖ బీచ్ రోడ్లో సముద్రుడి సాక్షిగా... భక్తుల మనోభావాలతో ఆడుకున్న పరమ వికృత వ్యాపారం. ఇక్కడ పైకి చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంది. అబ్బో... వీళ్ళెవరో మహానుభావులు..... అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ బాల రాముడినే మన ముందుకు తీసుకువచ్చారని అనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.. బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై ఏపీ హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు..
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సింధూరరెడ్డికి ఓ ఫోన్ వచ్చింది.. మాకు వడ్డించే అన్నం, కూర బాగాలేదని విద్యార్థులు నేరుగాఎమ్మెల్యే సింధూర రెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.. ఇక, ఫోన్ కాల్ తో స్పందించి ఎమ్మెల్యే సింధూరరెడ్డి.. పాముదుర్తి పాఠశాలలను విజిట్ చేశారు.. పాముదుర్తి ప్రాథమిక, హై స్కూల్ లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.. నాణ్యతలేని ఫుడ్ సరఫరాపై ఆగ్రహం వ్యక్తం చేశారు
ముందస్తు బెయిల్ ఇచ్చే సందర్భంలో విధించిన షరతుల్లో సడలింపు ఇవ్వాలని ఈ సారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఇక, వల్లభనేని వంశీ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనుంది న్యాయస్థానం..
పీ4పై అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పీ4 లోగోను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు.. #IAmAMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆవిష్కరించారు. అయితే, ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం.. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు..
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలకంగా ముందడుగు పడింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల మధ్య నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై ఒప్పందం జరిగింది.. ఈ ఒప్పందంపై మంత్రి నారాయణ సమక్షంలో సంతకాలు జరిగాయి.
వర్షాలు కురుస్తుండడంతో పుట్టగొడుగుల (Mushrooms) సీజన్ కూడా ప్రారంభం అయ్యింది.. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.. అయితే, పుట్టగొడుగుల ధర వింటేనే సామాన్యులకు షాక్ తగులుతోంది అంటున్నారు.. భోజన ప్రియులకు ఇష్టమైన పుట్టగొడుగులు ధర ప్రస్తుతం చికెన్, మటన్ తో పోటీపడుతోంది.