Bhumana Karunakara Reddy: మద్యం కుంభకోణం పేరుతో అక్రమ అరెస్టులకు కూటమీ ప్రభుత్వం పాల్పడుతొందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మీదా ఏ సెక్షన్ లు అయితే పెట్టారో వాటినే వైసిపి నేతలపై పెడుతున్నారు.
Wipha Cyclone: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన తర్వాత.. అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో.. ప్రస్తుతం ఇది తుఫానుగా మారిపోయింది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తామని నిర్మాత రత్నం ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో పర్మిషన్ వచ్చేసింది. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీమియర్స్ సహా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. తాజాగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ జీవో జారీ అయింది. Also Read:Mumbai: ముంబైలో దారుణం.. భర్తను…
పల్నాడు జిల్లా శావల్యపురం మండలం కనుమర్లపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లే ల్యాండ్ వ్యాన్, ఆటోఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న రూరల్ సిఐ ప్రభాకర్ రావు పరిస్థితిని సమీక్షించారు. మృతులంతా శావల్యాపురం మండలం కారుమంచి వాసులుగా గుర్తించారు. మృతులు బత్తుల బ్రహ్మయ్య, నాగమూర్తమ్మ,…
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి…
హరిహర వీరమల్లు సందడికి అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. నిజానికి ఈ వేడుకను ముందు తిరుపతి లేదా విశాఖపట్నంలో నిర్వహించాలని అనుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇండోర్ ఈవెంట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, 6:30 నుంచి 7:30 మధ్యలో కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది.…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వర్కర్లకు తీపికబురును అందించింది. మున్సిపల్ శాఖలో అవుట్సోర్సింగ్ నాన్- పీ హెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేటగిరి 1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి రూ.24,500 కు పెంచింది. కేటగిరీ 2 వర్కర్ల వేతనం రూ.18500 నుంచి రూ.21500 కు పెంపు, కేటగిరి 3 వర్కర్ల వేతనం రూ.15000 నుంచి 18500 కు పెంచుతూ నిర్ణయించింది. తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కు…
భారత చెస్ హిస్టరీలో నయా హిస్టరీ క్రియేట్ చేసింది కోనేరు హంపి. తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అద్భుతమైన ఆటను ఆడి చైనాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ యుక్సిన్ సాంగ్‌ను నిలువరించి సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోనేరు హంపి 1.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి…
Mudragada Padmanabham: కాపు సంఘం నాయకుడు, మాజీ మంత్రి, వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగానే ఉందని ముద్రగడ తనయులు బాలు, గిరిబాబు తెలిపారు. ఇక, మా తండ్రి ఆరోగ్యం పట్ల వస్తున్న వదంతులు నమ్మవద్దు అని సూచించారు.