RK Roja : గత ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ఆటలు నిర్వహించారు.. అయితే, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయ్యింది.. రేపో.. మాపో ఏపీ ప్రభుత్వానికి ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన నివేదిక అందనుంది.. దీంతో, వైఎస్ జగన్ కేబినెట్‌లో క్రీడా మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా అరెస్ట్ తప్పదా? అనే చర్చ సాగుతోంది..
Read Also: PM Modi: ఎంపీల నివాస సముదాయాన్ని ప్రారంభించిన మోడీ
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తి అయ్యింది.. క్రీడల నిర్వహణలో జరిగిన అవినీతిపై విజలెన్స్ ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది.. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది కూటమి ప్రభుత్వం.. ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందదని.. ఆగస్టు 10వ తేదీ తర్వాత మాజీ మంత్రి ఆర్కే రోజు ఏ క్షణంలోనే చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.. ఆడుదాం ఆంధ్రాను పార్టీ ప్రచారానికే ఎక్కువగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.. ఆడుదాం ఆంధ్రాలో సుమారు రూ.40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్లు ప్రచారం సాగుతోంది.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ కార్యక్రమం కింద 47 రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారట.. 2023 డిసెంబర్‌లో ఆడుదాం ఆంధ్రా క్రీడలను ప్రారంభించిన అప్పటి జగన్ సర్కార్.. ఆ పథకానికి రూ.119 కోట్ల నిధులను కేటాయించింది.. అయితే, దీంట్లో అవకతవకలు జరిగాయని, విచారణ జరపాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం..
Read Also: WAR 2 : ఒకటి కాదు.. రెండు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయడానికి రెడీ అవండి
వైసీపీ హయాంలో 119 కోట్ల రూపాయలతో నిర్వహించిన ఈ పోటీల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.. ఆడుదాం ఆంధ్రాను పార్టీ ప్రచారానికే ఎక్కువగా ఉపయోగించుకున్నారనే విమర్శలు వచ్చాయి.. పంపిణీ చేసిన కిట్లు నాసిరకంగా ఉండడం.. వాటిపై వైసీపీ స్టిక్కర్లు అతికించడం.. పబ్లిసిటీ కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు.. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా పాత్ర ఉందని టీటీడీపీ నేతలు ఆరోపించారు.. ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ విచారణ చేపట్టింది.. ఒక ఆటలో ఆడిన కిట్స్.. రెండో ఆటకే పనికిరాకుండా పోయాయని కొందరు ఆటగాళ్లు విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. అంతేకాదు. క్రీడల్లో వైసీపీ నేతలు చెప్పినవాళ్లనే విజేతలుగా ప్రకటించారనే విమర్శలు ఉన్నాయి.. ఇక, వర్క్ ఆర్డర్లను అప్పటి మంత్రి ఆర్కే రోజా.. మాజీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్పినవారికే ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరుతో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తుండగా.. ప్పుడు విలిజెన్స్ నివేదిక కీలకంగ మారింది.. నివేదిక ప్రభుత్వానికి చేరానే కేసులు పెట్టడం.. కీలక వ్యాఖ్యల అరెస్ట్‌లు తప్పవని.. ముఖ్యంగా మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్ట్ ఖాయమనే ప్రచారం సాగుతోంది..