హైడ్రో పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాటం తీవ్రరూపం.. సర్వే రాళ్లు ధ్వంసం..
ఇంతకాలం కొండకోనలను నమ్ముకుని ధైర్యంగా బ్రతికేస్తున్న ఆదివాసీల్లో హైడ్రో పవర్ ప్లాంట్స్ ఒణుకు పుట్టిస్తున్నాయి. భూములు, గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తే ఉనికికే ప్రమాదం అనే ఆందోళన మొదలైంది. అనంతగిరి, అరకు, కొయ్యూరు మండలాల పరిధిలో 7 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్టు ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి.. గతంలో ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన యంత్రాంగం మళ్లీ సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణకు సన్నద్ధం కావడంతో పోరాటానికి రెడీ అంటున్నాయి ఇక్కడ గ్రామాలు. జీవో నంబర్ 51 రద్దు కోసం డిమాండ్ చేస్తున్న గిరిజనులు.. ప్రభావిత ప్రాంతాల్లోకి సర్వే బృందాలు అడుగు పెడితే తిప్పికొడతామని హెచ్చరిస్తున్నాయి. హైడ్రో పవర్ ప్లాంట్స్ నిర్మాణం పేరుతో ఆదివాసీ గ్రామాల ఉనికిని నాశనం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు హెచ్చరిస్తున్నాయి. గిరిజనుల ఆందోళనకు వైసీపీ మద్దతు ప్రకటించింది. 1/70, పీసా వంటి చట్టాలు అమలులో ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేసే విధంగా యాక్షన్ ప్లాన్ కనిపిస్తోందోనే ఆందోళన ఎక్కువయింది. సర్వేల కోసం గ్రామాల్లోకి వస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో వ్యతిరేకత నేపథ్యంలో హైడ్రో పవర్ ప్లాంట్స్ పై ఎలా ముందుకు వెళ్లాలనే సందిగ్ధంలో యంత్రాంగం కనిపిస్తోంది.
జిల్లాల మార్పుపై ప్రభుత్వం కసరత్తు.. మారనున్న జిల్లాల స్వరూపం..!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాల మార్పుకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. కొన్ని జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుండగా.. స్వరూపం మార్చుకోనున్నాయి కొన్ని జిల్లాలు… జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది.. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు.. గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మారనున్నాయట.. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉండగా.. అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం.. పాలనా సౌలభ్యం సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది.. ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి కొత్త జిల్లాలోకి పలు నియోజక వర్గాలు మారనున్నాయట.. త్వరలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమై.. తాజా పరిస్థితులు… కొత్త జిల్లాలు.. సరిహద్దు మార్పులు పై చర్చించనుంది..
నేడు, రేపు భారీ వర్షాలు.. 13 నుంచి అతి భారీ వానలు!
హైదరాబాద్ వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జనగామ, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆగస్ట్ 13 నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మూర్ఖపు వ్యాఖ్యలు.. అవసరమైతే…!
అసిమ్ మునీర్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్. భారత్‌పై నిత్యం విషం కక్కుతూ ఉంటాడు. విదేశాల్లో స్థిరపడిన పాకిస్థానీయులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు జూన్‌లో మునీర్ అమెరికాలో పర్యటించాడు. వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. ఇక రెండు నెలల వ్యవధిలో మరోసారి అసిమ్ మునీర్ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడు. అయితే జూన్‌లో అమెరికాలో పర్యటించినప్పుడు ఓ కార్యక్రమంలో మునీర్ ప్రసంగిస్తూ భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా అవి వెలుగులోకి వచ్చాయి. వ్యాపారవేత్త, గౌరవ కాన్సుల్ అద్నాన్ అసద్.. ఫ్లోరిడాలోని టంపాలో నిర్వహించిన బ్లాక్-టై విందుకు మునీర్ హాజరై మాట్లాడాడు. ప్రసంగమంతా ఆద్యంతం భారత్‌ను లక్ష్యంగా చేసుకునే మాట్లాడినట్లు సమాచారం.
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి
ఇజ్రాయెల్ తాజాగా కొత్త రకం యుద్ధం మొదలుపెట్టింది. ఈసారి చేపట్టే ఆపరేషన్ తక్కువ సమయంలోనే ముగుస్తుందని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆదివారం సరికొత్త ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇన్ని నెలల నుంచి గాజాపై యుద్ధం చేస్తున్నా.. ఎప్పుడూ జర్నలిస్టులను టార్గెట్ చేసుకోలేదు. కానీ ఆదివారం మాత్రం జర్నలిస్టుల లక్ష్యంగా దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు జర్నలిస్టులు మృతిచెందారు. ఆదివారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అందులో జర్నలిస్టు ముసుగులో ఉన్న హమాస్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ తెలిపింది. అల్-షరీఫ్‌ను తామే చంపామని.. అతడు జర్నలిస్టుగా నటిస్తున్న హమాస్ ఉగ్రవాది అని పేర్కొంది. అల్-షరీఫ్ హమాస్‌కు చెందిన ఒక భాగానికి నాయకత్వం వహిస్తు్న్నాడని తెలిపింది.
ఒకటి కాదు.. రెండు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయడానికి రెడీ అవండి
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫ్యాన్స్ కు కావాల్సినంత జోష్ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ ను టెంపర్ కు ముందు టెంపర్ తర్వాత అని సెపరేట్ చేసి చూడాలి. టెంపర్ నుండి వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ కలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తాను అని చెప్పిన ఎన్టీఆర్ అయన అభిమానులను కాలర్ ను ఎగరేపిస్తూనే ఉన్నాడు. తాజాగా జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మరోసారి కాలర్ ఎగరేశాడు. అయితే ఈ సారి ఒకటి కాదు ఏకంగా రెండు కాలర్స్ ఎగరేసాడు. అంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. నిన్న, మొన్నటివరకు వార్ 2 కు బజ్ లేదన్నారు. ప్రమోషన్స్ కూడా సరిగా చేయడం లేదని అభిమానులు ఫీల్ అయ్యరు. కానీ ఎన్టీఆర్ చేసిన ఒకే ఒక స్పీచ్ తో ఈ సినిమాపై ఉన్ననెగిటివి మొత్తాన్నీ మార్చేశాడు ఎన్టీఆర్. ఈసారి రెండు కాలర్లూ ఎగరేసి మరీ ‘బొమ్మ అదిరిపోయింది’ అని చెప్పాడు. అంటే ఈ సినిమాపై ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ అంటే ఏమిటో అర్ధం చేసుకోండి. సూపర్ హిట్ కొడుతున్నాం అని చెప్పాడంటే.. ఈ సినిమాపై తనకెంత నమ్మకమో. ఇప్పటి వరకూ ‘వార్ 2’కి సంబంధించి ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు. ట్రైలర్ కానీ టీజర్ గాని సినిమాపై బజ్ ను తీసుకురాలేదు. కానీ వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగాక అందులో ఎన్టీఆర్ స్పీచ్ చూశాక ఈ ఒక్కటి చాలు. ఎన్టీఆర్ చెప్పాడంటే అది జరిగి తీరుతుందని ఫ్యాన్స్ కూడా రెండు కాలర్స్ ఎగరేస్తున్నారు.
నేను నీ డైపర్లు మారిస్తే.. నువ్వు నా ప్రపంచాన్నే మార్చేశావ్
అమ్మతనం ఒక స్త్రీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తల్లిగా మారిన తర్వాత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తూ, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఈ అనుభూతికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ఆలియా భట్, దీపికా పడుకొణె వంటి నటీమణులు తల్లిగా మారిన తర్వాత వచ్చిన మార్పుల గురించి బహిరంగంగా పంచుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా చేరింది. కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు జూలైలో ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న కియారా, కూతురు పుట్టాక తన జీవితం ఎలా మారిపోయిందో రీసెంట్‌గా సోషల్ మీడియాలో షేర్ చేసింది. కూతురితో గడుపుతున్న అమూల్యమైన క్షణాలను పంచుకుంటూ, “నేను నీ డైపర్లు మారుస్తున్నాను.. నువ్వేమో నా ప్రపంచాన్నే మార్చేశావ్. ఈ డీల్ చాలా బావుంది” అనే కోట్‌తో కూడిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దానికి హార్ట్ సింబల్, కళ్లలో నీళ్లు తిరిగే ఎమోజీలను కూడా జోడించింది. మొత్తానికి కియార తల్లిగా తన బాధ్యతలు పోషిస్తోంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే, కియారా నటించిన ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల కానుంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా, యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కూడా కియారా నటిస్తోంది. మరోవైపు, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘పరం సుందరి’ ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ఈ జంట ఇటు తల్లిదండ్రులుగా.. హీరో హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.
వార్ 2 ఈవెంట్ సూపర్ సక్సెస్.. కానీ ఎన్టీఆర్ క్షమాపణలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకులు త్రివిక్రమ్ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. తన సూపర్ సెన్సషనల్ స్పీచ్ తో ఫ్యాన్స్ కు జోష్ నింపాడు ఎన్టీఆర్. ఇప్పటిదాకా ప్రమోషన్స్ సరిగా చేయడం లేదనుకున్న అభిమానులకు కావాల్సినంత హై ఇచ్చాడు తారక్. ‘వార్-2′ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం యంగ్ టైగర్ NTR క్షమాపణలు కోరుతూ Xలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ’ ‘ఇందాక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను క్షమించాలి. ఈవెంట్ సజావుగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. CM రేవంత్ గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ అందించిన సపోర్టుకు నా పాదాభివందనాలు. ఎంతో బాధ్యతతో ఫ్యాన్స్ ఆనందానికి కారణమయ్యారు’ అని వ్యాఖ్యానించారు.
సినీ కార్మికుల 8వ రోజు సమ్మె అప్డేట్.. అవి కూడా బంద్
నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ పూర్తిగా బంద్ కాబోతున్నాయి. నిన్న జరిగిన చర్చల్లో ఫెడరేషన్ డిమాండ్స్ కు ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో షూటింగ్ లు బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది ఫిలిం ఫెడరేషన్. ఫిలిం ఫెడరేషన్ కు వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతలకు చెందిన సినిమాల షూటింగ్స్ కుడా బంద్ ప్రకటించారు. శుక్రవారమే ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశం. నేటి నుంచి షూటింగ్స్ఎ క్కడిక్కక్కడే నిలచిపోనున్నాయి. నిర్మాతల పెట్టిన కండిషన్స్ కు ఫెడరేషన్ ఒకే అంటేనే వేతనాలు పెంచుతామని చెప్పిన నిర్మాతలు. 30 శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి వెళ్తామని చెప్పిన ఫెడరేషన్ నాయకులు. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం మాకు అంగీకారం కాదు అని తేల్చి చెప్పిన ఫెడరేషన్. నిర్మాతలు కొన్ని యూనియన్లను విడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. పీపుల్స్ మీడియా నిర్మాత టీ జి విశ్వప్రసాద్ సినీ కార్మికులకు క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుపడుతున్నారు ఫెడరేషన్ నాయకులు. షూటింగ్స్ బంద్ నేపధ్యంలో నేడు నిర్మాతలు , ఫెడరేషన్ నాయకులతో తెలంగాణా సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి చర్చలు జరపబోతున్నారు. ఫెడరేషన్ నాయకులు ఈరోజు మధ్యాహ్నం తరువాత మంత్రి కోమటి రెడ్డి ని కలిసే అవకాశం ఉంది. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల తో ఈ రోజు చర్చలు జరుపుతామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. మరోవైపు టాలివుడ్ లో నెలకొన్న ఈ వివాదం త్వరలోనే ముగిసి షూటింగ్స్ మళ్ళి స్టార్ట్ అవ్వాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. మరి నేడు జరగబోయే మీటింగ్ లో ఆ దిశగా పరిష్కారం లబిస్తుందో లేదో.