Tribals Protest: అల్లూరి సీతారామరాజు జిల్లాలో హైడ్రోపవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాటం తీవ్ర రూపం దాలుస్తోంది. అరకులోయ మండలం లోతేరులో సర్వే రాళ్లను ధ్వంసం చేశారు గిరిజనులు.. తమ సంప్రదాయ ఆ యుధాలతో ప్రదర్శన నిర్వహించారు. పవర్ ప్లాంట్లను తరిమి కొడతామని హెచ్చరించడంతో ఏజెన్సీ నివురుగప్పింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇంతకాలం కొండకోనలను నమ్ముకుని ధైర్యంగా బ్రతికేస్తున్న ఆదివాసీల్లో హైడ్రో పవర్ ప్లాంట్స్ ఒణుకు పుట్టిస్తున్నాయి. భూములు, గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తే ఉనికికే ప్రమాదం అనే ఆందోళన మొదలైంది. అనంతగిరి, అరకు, కొయ్యూరు మండలాల పరిధిలో 7 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్టు ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి.. గతంలో ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన యంత్రాంగం మళ్లీ సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణకు సన్నద్ధం కావడంతో పోరాటానికి రెడీ అంటున్నాయి ఇక్కడ గ్రామాలు. జీవో నంబర్ 51 రద్దు కోసం డిమాండ్ చేస్తున్న గిరిజనులు.. ప్రభావిత ప్రాంతాల్లోకి సర్వే బృందాలు అడుగు పెడితే తిప్పికొడతామని హెచ్చరిస్తున్నాయి.
Read Also: War 2 Pre Release Event : నన్ను ఎవ్వరూ ఆపలేరు.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్
హైడ్రో పవర్ ప్లాంట్స్ నిర్మాణం పేరుతో ఆదివాసీ గ్రామాల ఉనికిని నాశనం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు హెచ్చరిస్తున్నాయి. గిరిజనుల ఆందోళనకు వైసీపీ మద్దతు ప్రకటించింది. 1/70, పీసా వంటి చట్టాలు అమలులో ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేసే విధంగా యాక్షన్ ప్లాన్ కనిపిస్తోందోనే ఆందోళన ఎక్కువయింది. సర్వేల కోసం గ్రామాల్లోకి వస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో వ్యతిరేకత నేపథ్యంలో హైడ్రో పవర్ ప్లాంట్స్ పై ఎలా ముందుకు వెళ్లాలనే సందిగ్ధంలో యంత్రాంగం కనిపిస్తోంది.