Shri Shakti Scheme: ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తున్న కూటమి సర్కార్ ఇప్పుడు కీలకమైన పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందుబాటులోకి రానుంది… ఇక, స్త్రీ శక్తి స్కీమ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభంపై ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చెయ్యచ్చు. పల్లె వెలుగు. అల్ట్రా పల్లె వెలుగు… సిటీ ఆర్డినరీ.. మెట్రో.. ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణం చెయ్యచ్చు. ఆంధ్రప్రదేశ్ నివాసులైన మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు – ఐడీ ప్రూఫ్‌తో ఉచిత ప్రయాణానికి అర్హులు.. నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ బస్సులకు ఈ స్కీమ వర్తించదు.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అన్ని ఏసీ బస్సులకు ఈ స్కీమ్ నుంచి మినహాయింపు ఇచ్చారు..
Read Also: Chinmayi Sripada : మీ పని మీరు చూసుకోండి.. రిపోర్టర్ పై చిన్మయి ఫైర్
ఇక, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.. మహిళా కండక్టర్లకు బాడీ వార్న్ కెమెరాలు, అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.. బస్ స్టేషన్లలో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాల మెరుగుదలపై ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. అర్హులైన ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేయనుండగా.. ఆ ఖర్చును RTCకి రీయింబర్స్ చేయనుంది ప్రభుత్వం… రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడి కైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.. రాష్ట్రం వ్యాప్తంగా 8,459 బస్సులను మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కోసం కేటాయించారు. ఏడాదికి ఈ పథకం అమలు వలన కోసం రూ.1,950 కోట్లు కేటాయించనుంది ప్రభుత్వం.. ఇక, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు చూపించి ఉచిత బస్సులో మహిళలు ప్రయాణం చేయవచ్చు.. మొన్న జరిగిన కేబినెట్ భేటీలో ఈ పథకం అమలుపై చర్చించి.. అమోదం తెలిపారు.. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు మొదలు అయ్యాయి.. జీరో ఫేర్ టికెట్ మహిళలకు ఇస్తారు.. గుర్తింపు కార్డు మాత్రం ప్రయాణ సమయంలో చూపించాలి.. ఆధార్ కార్డు.. ఓటర్ ఐడీ.. రేషన్ కార్డు.. పాన్ కార్డు కొన్ని గుర్తింపు పొందిన కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు..
Read Also: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన గోల్డ్ రేట్స్
ఈ పథకం అమలు కోసం మొత్తం ఏపీఎస్ ఆర్టీసీకి 11,500 బస్సులు ఉండగా.. 8,459 బస్సులను మహిళల ఉచిత బస్సు పథకం కోసం కేటాయించింది.. మహిళలకు, చదువుకునే మహిళా విద్యార్ధినులకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు.. ఈ ఏడాదికి ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 1,950 కోట్లు నిధులు ఖర్చు చేయనుంది.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొత్తగా 700 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసింది.. వచ్చే రెండేళ్లలో మరో 1400 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.. అలాగే అవసరమైన సిబ్బందిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు పథకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణంపై ఉత్తర్వులు జారీ చేసింది..