Andhra Pradesh: జిల్లాల మార్పుపై ప్రభుత్వం కసరత్తు.. మారనున్న జిల్లాల స్వరూపం..!
- కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు..
- కొన్ని జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై ..
- మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు..
- జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాల మార్పుకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. కొన్ని జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుండగా.. స్వరూపం మార్చుకోనున్నాయి కొన్ని జిల్లాలు… జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది.. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు.. గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మారనున్నాయట.. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉండగా.. అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం.. పాలనా సౌలభ్యం సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది.. ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి కొత్త జిల్లాలోకి పలు నియోజక వర్గాలు మారనున్నాయట.. త్వరలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమై.. తాజా పరిస్థితులు… కొత్త జిల్లాలు.. సరిహద్దు మార్పులు పై చర్చించనుంది..
Read Also: Coolie : ‘కూలీ’ లో మరో ట్విస్ట్..యంగ్ రజనీ పాత్రలో స్టార్ హీరో ఎంట్రీ !
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఇక, జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు పరిశీలిస్తే.
1. పలాస: ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం
2. శ్రీకాకుళం: శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం
3. మన్యం పార్వతీపురం: పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ
4. విజయనగరం: విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి
5. విశాఖపట్నం: భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి
6. అల్లూరి సీతారామరాజు అరకు: అరకు, పాడేరు, మాడుగుల
7. అనకాపల్లి: అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని
8. కాకినాడ: కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం
9. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం: రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం
10. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ అమలాపురం: అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట
11. పశ్చిమ గోదావరి నరసాపురం: తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం
12. ఏలూరు: ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం
13. కృష్ణా మచిలీపట్నం: కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు
14. ఎన్టీఆర్ విజయవాడ: విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం
15. అమరావతి: పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ
16. గుంటూరు: గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు
17. బాపట్ల: బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు
18. పల్నాడు నరసరావుపేట: నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ
19. మార్కాపురం: మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి
20. ఒంగోలు: ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు
21. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావాలి, కోవూరు, ఉదయగిరి
22. గూడూరు: గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట
23. శ్రీ బాలాజీ తిరుపతి: తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి
24. చిత్తూరు: చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం
25. మదనపల్లి: మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి
26. సత్యసాయి హిందూపురం: హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర
27. అనంతపురం: అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపర్తి
28. ఆదోని: ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం
29. కర్నూలు: కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు
30. నంద్యాల: నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం
31. వైఎస్సార్ కడప: కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల
32. అన్నమయ్య రాజంపేట: రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!