రాజధాని ప్రాంతం అమరావతి రైతులకు తీపికబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రైతులకు సంబంధించిన 11వ ఏడాది కౌలు సొమ్మును విడుదల చేసింది సర్కార్.. 163.67 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు మంత్రి సుభాష్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్న అమలాపురం ఘటనలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది డబ్బులు తీసుకున్నారు.. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు దాడి చేశారని తెలిపారు.. అయితే, దాడి చేసినవారు. నా అనుచరులు అని వైసీపీ బ్యాచ్.. నా పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నేను రౌడీనే.. అందుకే నా ఊరు బాగుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అందరూ మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోతే.. నన్ను ఒక్కడినే గెలిపించారని గుర్తుచేశారు జేసీ.. ఇక, తాడిపత్రి ప్రజలు నాకు దేవుళ్లు.. వాళ్ల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నారు..
HHVM : పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత హరిహర వీరమల్లు సినిమా వస్తోంది. భారీ పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొన్నటి వరకు ఏ సినిమాకు లేనంతగా ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా రేట్లు కూడా పెంచేశాయి. ఇక ప్రీమియర్స్ షోలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ చూస్తే పవన్ రేంజ్ ఏంటో అర్థమైపోతోంది. ఇప్పుడున్న హవా చూస్తుంటే ప్రీమియర్స్ తోనే భారీ రికార్డులు…
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా.. దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఈ సమయంలో ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్లు వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది..
Investopia Global-AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టోపియా గ్లోబల్- ఏపీ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సు విజయవాడలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
CPI Ramakrishna: సీపీఐ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టీడీపీ, వైసీపీ పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు. ఆదాని పవర్స్ తో 17 వందల కోట్ల రూపాయల లంచం తీసుకుని వైసీపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక, టీడీపీ అధికారంలోకి వచ్చాక యూజర్ చార్జీల పేరుతో మరో రూ. 15 వందల కోట్లు ప్రజలపై భారం వేసింది అని ఆరోపించారు.
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో అవసరమైన కొన్ని సదుపాయాలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.