అవకాశం దొరికితే.. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు నారా లోకేష్‌పై సెటైర్లు వేయానికి సిద్ధంగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు మరోసారి నారా లోకేష్‌ను టార్గెట్ చేసిన ఆయన.. తాజాగా, లోకేష్ తీస్తున్న ఓ సెల్ఫీకి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పంచ్‌లు వేశారు.. ”ఇదేంటి బోకేష్! అక్కడ ఫోన్ ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ అంత ఎత్తులో పెడితే…
వరస సమీక్షలు.. హెచ్చరికలు తర్వాత మాట వినని పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత, సీఎం జగన్. వైసీపీలో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్య నేతలనే పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. రెండు నెలల కిందట గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష సందర్భంగా రీజినల్ కోఆర్డినేటర్ల పనితీరును అసెస్ చేసిన జగన్.. కొంతమంది పనితీరుపై ఓపెన్‌గానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, మంత్రి…
2019 అసెంబ్లీ ఎన్నికలు దెందులూరు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. తనకు ఎదురే లేదని అనుకున్న టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఓడిపోగా.. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొఠారు అబ్బయ్య చౌదరి గెలిచారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో.. సీన్ మారిపోయింది. దెందులూరులో పొలిటికల్ గేమ్ కూడా ఆ స్థాయిలో రక్తికట్టిందనే చెప్పాలి. ఇప్పటికీ నియోజకవర్గంలో నేతల మధ్య రాజకీయ చదరంగం నడుస్తోంది. అయితే, గత ఎన్నికల్లో ఓడినా దూకుడు తగ్గించని…
గతంలో ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ముద్రగడ పద్మనాభానికి ఉంది. సమయానుకూలంగా పార్టీలు మారుతూ కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు.. మరికొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. 1994లో తొలిసారి ప్రత్తిపాడులో ఓడిన తర్వాత.. ఇక జీవితంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాబోనని భీష్మించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ సీట్ ఆఫర్ చేయడంతో పిఠాపురంలో పోటీ చేసినా.. ఆ సీటును ప్రజారాజ్యం పార్టీ గెల్చుకుంది. ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగి.. కాపు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తర్వాత…
కొన్ని మోసాలు చూస్తుంటే.. ఎవరు అసలు..? ఎవరు నకిలీ ? అనేది కూడా అర్థం చేసుకోవడం కష్టంగా మారుతోంది.. తాజాగా, ఓ వ్యక్తి కృష్ణాజిల్లా గన్నవరంలో సబ్ కలెక్టర్ అవతారమెత్తాడు.. అందినకాడికి దోచుకున్నాడు.. సబ్ కలెక్టర్ అవతారంలో అమాయక ప్రజల నుండి లక్షలు దండుకున్నాడు కేటుగాడు.. ఇలా అనేక మంది దగ్గర సుమారు 70 నుండి 80 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు ఫేక్ సబ్ కలెక్టర్ పిల్లా వెంకట రాజేంద్ర.. అయితే, కొంతకాలానికి మేం…
* ఆక్లాండ్: నేడు భారత్ – న్యూజిలాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్… టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. * తిరుమల: ఇవాళ ఆన్లైన్లో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. డిసెంబర్ మాసానికి సంబంధించిన కోటా విడుదల చేయనున్న అధికారులు. * ఢిల్లీ: నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి * నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు…
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇప్పటంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించింది.. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మందికి మొత్తంగా 14 లక్షల రూపాయాలు జరిమానా విధించింది హైకోర్టు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయించినందుకు జరిమానా విధించింది న్యాయస్థానం.. అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పి.. స్టే తెచ్చుకున్నారు. ఇప్పటంలో ఇళ్లు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఢిల్లీ బాటపట్టనున్నారు.. డిసెంబర్ 5వ తేదీన హస్తినకు వెళ్తారు సీఎం జగన్.. ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరుకానున్నారు వైసీపీ అధినేత.. డిసెంబర్ 1వ తేదీ 2022 నుంచి నవంబర్ 30, 2023 వరకు జీ- 20 దేశాల కూటమికి అధ్యక్షత వహించనుంది భారతదేశం.. ఈ నేపథ్యంలో భారత్ లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై…
దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు గిడుగు రుద్రరాజు.. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పదవి కన్నా పీసీసీని బాధ్యతగా స్వీకరిస్తాను అన్నారు.. టీమ్ వర్క్ తో ముందుకు వెళ్తాను.. ఈ దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం తామేనని స్పష్టం చేశారు.. త్వరలోనే బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర పర్యటన చేస్తామని ప్రకటించారు. ఇక, అగ్ర వర్ణాలవారికే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారంటూ హర్షకుమార్ అసంతృప్తి…
ఏడ్చే మగాడిని.. నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని పెద్దలు చెబుతుంటారు.. అంటే, ఏడుపు అనేది మగవాని స్వభావానికి విరుద్ధం.. అదే విధంగా నవ్వు అనేది సామాన్య స్త్రీ స్వభావానికి విరుద్ధమట.. అందుకే ఈ సామెత వచ్చిందంటారు.. అయితే, ఈ సామెతను చెబుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. ఏడ్చే మగాడిని నమ్మకపోవడం మన సంస్కృతి.. ఆంధ్ర ప్రజలు ఏడ్చే మగవాడిని నమ్మొద్దు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో…