ఈజీ మనీ కోసం కొందరు షాట్‌కట్స్ వెతుకుతుంటారు.. త్వరగా డబ్బులు సంపాదించాలి.. లక్షాధికారిని అయిపోవాలి.. కోటీశ్వరుడిగా పేరు తెచ్చుకోవాలి.. ఇలా ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు.. అయితే, వీరికంటే అడ్వాన్స్‌డ్‌గా సైబర్ నేరగాళ్లు ఉన్నారనే విషయాన్ని మర్చిపోతారు.. ఈజీగా వారి వలలో చిక్కుకుని ఉన్నకాడికి సమర్పించుకుంటారు.. తాజాగా, గుంటూరు జిల్లాలో కిడ్నీకి రూ.7 కోట్ల ఆఫర్ కలకలం సృష్టించింది.. ఆన్‌లైన్‌లో ఉన్న సమయంలో.. కిడ్నీ అమ్మితే భారీగా డబ్బులు వస్తాయనే ఓ లింక్ చూసిన ఇంటర్ విద్యార్థిని.. ఆ లింక్ క్లిక్ చేసి తన వివరాలు పొందుపర్చింది. .ఇక, కిడ్నీ అమ్మితే రూ. 7 కోట్లు ఇస్తామని సైబర్ నేరగాళ్లు ఆ యువతికి ఆఫర్ ఇచ్చారు. అలా సైబర్ నేరగాళ్లు.. ఆ విద్యార్థితో పరిచయం చేసుకున్నారు. ఫేక్ అకౌంట్ చూపి మూడు కోట్ల రూపాయాలు బాధిత యువతి ఖాతాలో జమ చేసినట్లు చూపించారు.
Read Also: Jio 5G: గుడ్‌న్యూస్ చెప్పిన జియో.. యూజర్లకు ఇక పండగే..!
అయితే, అక్కడే అసలు రూపాన్ని బయటపెట్టారు కేటుగాళ్లు.. ఆ డబ్బులు రిలీజ్ కావాలంటే తమకు నగదు పంపాలని చెప్పారు. దీంతో విద్యార్థినిని విడతల వారిగా.. సైబర్ మోసగాళ్లకు రూ.16 లక్షలు పంపింది.. డబ్బులు ఇస్తామని ఢిల్లీకి రావాలని చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్లారు. అయితే, తాను మోసం పోయినట్లు తెలుసుకున్న విద్యార్థినిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని విద్యార్థినిని విజ్ఞప్తి చేసింది.. అయితే, ఈ కిడ్నీ ఆఫర్‌పై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన యువతి.. తాను ఎలా మోసపోయానో వివరించింది.. తాను నాన్నకు తెలియకుండా.. రూ.80 వేలు వాడుకున్నాను.. అయితే, ఆ మొత్తాన్ని మళ్లీ నాన్న ఖాతాలో వేయాలనుకున్నాను.. ఈ సందర్భంలోనే కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయని తెలుసుకుని.. దాని కోసం వెతికానని దాందో.. కిడ్నీ డొనేటెడ్ యాప్ తగిలిందన్నారు..
ఇక, వాళ్లు లీగల్ చార్జీలు, ఇతర ఖర్చులు ఇలా.. వాళ్లు అడిగినప్పుడల్లా డబ్బులు చెల్లిస్తూ పోయా.. మొత్తం రూ.16 లక్షలు వారికి ఇచ్చానని వెల్లడించింది విద్యార్థిని.. మా నాన్న ఇంటి నిర్మాణం కోసం రూ.20 లక్షలు బ్యాంకు ఖాతాలో వేసుకున్నారు.. ఆ డబ్బుల నుంచి సైబర్ నేరగాళ్లు అడిగినప్పుడల్లా వేస్తూ.. మొత్తంగా రూ.16 లక్షలు పోగొట్టుకున్నట్టు ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.. ఎవరైనా ఈజీగా మనీ సంపాదించేందుకు ప్రయత్నించొచ్చు.. కానీ, ఇలా తప్పుడు మార్గాల్లో వెళ్లి.. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కడంతో.. ఉన్నది, ఉంచుకున్నది.. మొత్తం పోగొట్టుకోవడం ఖాయం.. రోజు తరహాలో మోసాలకు పాల్పడుతోన్న కేటుగాళ్లు.. ఈ విధంగానైనా.. మీ నుంచి డబ్బులు లాగేసే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త..
https://www.facebook.com/NtvTeluguLive/videos/1328824477942440/