Guntur District: యుగపురుషుడు నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని పాలపర్రు గ్రామంలో ఆవిషష్కరించాడు తారకరత్న. యన్టీఆర్ విగ్రహా విష్కరణ అనంతరం తారకరత్న మాట్లాడుతూ ‘1982లో కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఆ మహానుభావుడు వేసిన తెలుగుదేశం అనే పునాది ఆ రోజు పేద ప్రజానీకానికి అతి పెద్ద భవంతి. రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేసి దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు రామన్నగా నిలిచిన మహానుభావుడు ఎన్టీఆర్. సంకీర్ణ ప్రభుత్వాలు మన దేశాన్ని పాలించే విధానానికి నాంది పలికింది ఆయనే. ఆయన కలలు కన్న ఆంధ్ర రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆయనకు మనవడిగా, బాలయ్య బాబాయికి అబ్బాయిగా, చంద్రబాబు నాయుడు మేనల్లుడుగా, మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Read Also: Bigg Boss Adi Reddy: ఆది రెడ్డి ఇంత పారితోషికం తీసుకున్నాడా?
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెదరత్తయ్యతో పాటు టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు ఇనగంటి జగదీష్ బాబు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటితో పాటు పలు గ్రామాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు, నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.