వాళ్లిద్దరూ కలిసినా వైసీపీ కంచుకోటను ఇంచు కూడా కదల్చలేరు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ మరోసారి సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ వారాహి మీద కాకుండా వరాహం మీద తిరిగినా తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అనే చవట, సన్నాసి చంద్రబాబు బూట్లు నాకుతున్నాడని ఆరోపించారు. ఎవరైనా తాను సీఎం అవుతానంటారని.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌కు ధైర్యం ఉంటే 175 నియోజకవర్గాలలో పోటీ చేయాలని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ విజిటింగ్ వీసాపై వారానికి ఒకసారి వచ్చి వాగిపోతాడని.. ప్రజలను రెచ్చగొట్టడమే పవన్ పని అని సెటైర్లు వేశారు. మరోవైపు పవన్‌ను నమ్ముకుంటే జనసేన కార్యకర్తలు నట్టేట మునగడం ఖాయమని మంత్రి జోగి రమేష్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో పందులు, కుక్కలు కూడా తిరుగుతున్నాయని.. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి పవన్ కళ్యాణ్ తిరుగుతుంటే ఎవరు అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. పంది మీద తిరిగినా ఆయన్ను ఎవరూ అడ్డుకోరని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగన్ వీరుడు, ధీరుడు అని.. ప్రజల కోసం పనిచేస్తున్నాడని స్పష్టం చేశారు. జగన్‌ను మళ్లీ సీఎం కాకుండా చేస్తానని పవన్ అంటున్నాడని.. పవన్ కాదు కదా, ఆయన దత్తతండ్రి చంద్రబాబు వచ్చినా వైసీపీ కంచుకోటను ఇంచు కూడా కదల్చలేరని జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు.
భూమి ఇలాగే అంతం అవబోతోందా..? చనిపోతున్న ఈ గ్రహమే ఉదాహరణ
విశ్వంలో ప్రతీదానికి పుట్టుక, మరణం అనేది ఉంటుంది. ఏదో రోజు మన సౌరవ్యవస్థకు మూలం అయిన సూర్యుడు కూడా చనిపోతాడు. అయితే దీనికి కొన్ని బిలియన్ ఏళ్ల సమయం పడుతుంది. అయితే ఆ సమయంతో భూమి కూడా అంతం అవుతుంది. అయితే చివరి రోజుల్లో భూమి అంతం ఎంతటి దారుణంగా ఉంటుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు అంచానా వేస్తున్నారు. అయితే అందుకు ఓ ఉదాహరణ లభించింది. వృద్ధాప్యంలో ఉన్న సూర్యుడు వంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఓ గ్రహం తన మాతృ నక్షత్రాన్ని ఢీకొట్టేందుకు వెళ్తున్నాడు. ఇలాగే భూమి అంతం ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సోమవారం ప్రచురించిన ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. ఎక్సోప్లానెట్ కెప్లర్-1658బీ తన మాతృనక్షత్రాన్ని త్వరలోనే ఢీకొడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరిగ్గా ఈ గ్రహానికి ఎదురయ్యే పరిస్థితులే చివరి రోజుల్లో మన భూమికి కూడా ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
మోడీని కలిసిన సుందర్ పిచాయ్.. జీ20కి మద్దతు
భారత ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. సోమవారం ఇరువురు సమావేశం అయ్యారు. అందరికి ఓపెన్, కనెక్టెడ్ ఇంటర్నెట్ కు మద్దతు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇరువురి మధ్య జీ-20 సమావేశంపై చర్చ జరిగింది. ఈ నెల మొదట్లో భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతను తీసుకుంది. ‘‘గూగుల్ ఫర్ ఇండియా’’ ఈవెంట్ కు హాజరుకావడానికి సుందర్ పిచాయ్ ఇండియాకు వచ్చారు.వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 200 సమావేశాలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో G20 సదస్సు నిర్వహించనున్నారు. ఈ భేటీపై సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. భారత ప్రధానితో సమావేశం కావడంపై ధన్యవాదాలు తెలిపాడు. మీ నాయకత్వంలో సాంకేతిక మార్పు వేగవంతం కావడానికి స్పూర్తినిస్తోందని.. గూగుల్, ఇండియాల మధ్య బలమైన భాగస్వామ్య కొనసాగించడానికి అందరికీ పనిచేసే ఓపెన్, కనెక్ట్ ఇంటర్నెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశ జీ-20 అధ్యక్ష పదవికి మద్దతు ఇవ్వాలని ఎదురుచూస్తున్నా అని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. జీ 20 అనేది ప్రపంచంలో 20 ప్రధాన అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కూటమి. ఈ ఏడాది ఇండోనేషియా జీ-20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇండోనేషియా నుంచి 2023కు గానూ జీ-20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా తీసుకుంది.
59 కి.మీ. పాటు నిలబడి బైక్ నడిపాడు.. ప్రపంచ రికార్డు సృష్టించాడు
సాధారణంగా బైక్‌పై కూర్చుని ఏకధాటిగా 50 కిలోమీటర్లు నడపటం కష్టతరంగా ఉంటుంది. కానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)కు చెందిన ఓ స్టంట్ బైకర్ సోమవారం నాడు ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్‌పై ఫ్యూయల్ ట్యాంకర్‌పై నిలబడి 59.1 కిలోమీటర్ల పాటు ప్రయాణించాడు. అతడు 59.1 కి.మీ. దూరాన్ని ఒక గంట 40 నిమిషాల 60 సెకన్‌లలో చేరుకుని రికార్డు సృష్టించాడు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ మార్గంలో ఈ పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బీఎస్ఎఫ్ ఇండియాకు చెందిన జాంబాజ్ టీమ్ సభ్యుడు సీటీ ప్రసన్నజీత్ నారాయణ్‌దేవ్ అనే స్టంట్ బైకర్ బైక్‌పై నిలబడి 59 గంటల పాటు ప్రయాణించి ఈ రికార్డు సాధించాడు. కాగా ఇటీవల ఇద్దరు స్టంట్ బైకర్లు కూడా వేర్వేరు ప్రపంచ రికార్డులను సాధించారు. ఇన్‌స్పెక్టర్ విశ్వజీత్ భాటియా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బైకుపై పడుకుని లాంగెస్ట్ రైడ్ చేశాడు. అతడు 2 గంటల 6 నిమిషాల17 సెకన్‌ల పాటు విరామం లేకుండా దేశ రాజధాని ఢిల్లీ చావ్లా ప్రాంతంలోని BSF స్టేడియంలో మొత్తం 70.2 కి.మీ. పాటు బైక్‌పై పడుకుని నడిపాడు. అంతేకాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీపై అమర్చిన 12 అడుగుల 9 అంగుళాల పొడవు గల నిచ్చెనపై ఇద్దరు వ్యక్తులు ఇన్‌స్పెక్టర్ అవధేష్ కుమార్ సింగ్, కానిస్టేబుల్ సుధాకర్ సుదీర్ఘ రైడ్ చేసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
పాఠశాలల్లో పిల్లల భద్రత, రక్షణ కమిటీ భేటీ
తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్ధుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో పిల్లల భద్రత, రక్షణకు పటిష్ట మార్గదర్శకాలు రూపకల్పనకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ జరిగింది. వివిధ భాగస్వాములతో త్రిసభ్యకమిటి సంప్రదింపులు జరిపింది. త్రిసభ్య కమిటీ చైర్ పర్సన్ సీనియర్ IAS అధికారి రాణి కుముదిని మాట్లాడుతూ.. చిన్నారుల రక్షణ మరియు భద్రత మనందరి బాధ్యత అన్నారు. ఇకపై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి పటిష్ట మార్గదర్శకాలు రూపొందించుటకు విలువైన నిర్దిష్టమైన సలహాలను సూచనలను ఇవ్వాలన్నారు.డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో టెక్నాలజీ పరంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుటకు వారి భద్రత మరియు రక్షణ ముఖ్యమైన అంశంగా సంతరించుకుందన్నారు. పిల్లలు తిరిగేచోట పరిసరాలను కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ఏదైనా సంఘటన జరగక ముందే మేలుకునేలా ఉండాలని, ఒకవేళ ఏదైనా జరిగినా వెంటనే చెప్పగలిగేలా Mentor Teachers చొరవ తీసుకోవాలన్నారు.షీటీమ్స్ DIG సుమతి మాట్లాడుతూ.. ఇటీవల సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది… పిల్లలు ఫిర్యాదు చేసిన వెంటనే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పిల్లలు ఎలాంటి సంకోచాలు లేకుండా వివరాలు అందచేయాలన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన కమిటీ ఉద్దేశ్యాలను వివరించే ప్రయత్నం చేశారు. పిల్లల శ్రేయస్సు, రక్షణ అనేది సామాజిక బాధ్యతగా భావించి అందరూ భాగస్వాములై బాధ్యత వహించాలన్నారు.
పాతబస్తీలో దారుణం.. MIM కార్పొరేటర్ మేనల్లుడి మృతి
పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఎంఐఎం కార్పొరేటర్ ఆజం మేనల్లుడు సయ్యద్ ముర్తూజా అనాస్ మృతిచెందాడు. లలితాబాగ్ లోని కార్పోరేటర్ కార్యాలయం బయట సయ్యద్ ముర్తూజా పై దాడి జరిగింది. కార్యాలయం లోపలికి వెళ్ళి కుప్పకూలిపోయాడు సయ్యద్. దాడిలో తీవ్రంగా గాయపడిన ముర్తుజాను ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికి మృతి చెందాడు సయ్యద్ ముర్తుజా. సయ్యద్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు పోలీసులు.ఇదిలా ఉంటే.. మృతుడు సయ్యద్ ముర్తుజా అన్వర్ ఉలుం కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సయ్యద్ హత్య కేసులో నిందితుల కోసం గాలింపు జరుగుతోంది. మొత్తం ఐదు టీమ్ ల ఏర్పాటు చేశారు. సయ్యద్ ముర్తూజా హత్యకు గల కారణాలు ఇంకా తెలియదంటున్నారు పోలీసులు. సయ్యద్ ముర్తూజాపై హత్యాయత్నానికి పాల్పడింది ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు. కార్పేరేటర్ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి.. కత్తులతో దాడి చేశారని తెలిపారు. కార్పొరేటర్ మేనల్లుడు సయ్యద్ ముర్తూజా తీవ్ర గాయలపాలయ్యాడు… ఒవైసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కార్పొరేటర్ మేనల్లుడు లక్ష్యంగా దాడి చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు.