మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ రాయలసీమ గర్జన నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ వైసీపీ మద్దతు పలికింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Sajjala Ramakrishna Reddy: ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఓ ప్రభుత్వ విభాగంలో కొద్ది మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు వచ్చాయని.. సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని సజ్జల తెలిపారు. ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరింపజేయాలని సీఎం ఆదేశించారన్నారు. పంచాయతీరాజ్ డిపార్టుమెంట్‌లోనూ పొరుగు సేవల సిబ్బంది తొలగించారన్న అంశంపైనా విచారణ…
Nadendla Manohar: చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తాం.. ఎదురించి నిలబడితే ఆస్తులను ధ్వంసం చేస్తాం.. మాన, ప్రాణాలను తోడేస్తామన్న రీతిలో ఆదివారం రాత్రి పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ప్రవర్తించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన…
-బంగాళాఖాతంలో అల్పపీడనం -రెండు రోజుల్లో తుఫాన్‌గా మారే ఛాన్స్ -ఏపీలోని నాలుగు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం -నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలకు వర్ష సూచన -ఈనెల 7, 8, 9 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు…
Buggana Rajendranath: కర్నూలులో జరుగుతున్న రాయలసీమ గర్జన సభకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా చెప్పాలన్నారు. కరువు కారణంగా కాళేబరాలు కూడా పూడ్చిపెట్టిన ప్రాంతం రాయలసీమ అన్నారు. ఒక్క మగాడు సీఎం జగన్ హైకోర్టు కర్నూలుకు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. హంద్రీనీవాకు మొదట చంద్రబాబు రూ.13 కోట్లు ఇస్తే వైఎస్ఆర్ రూ.4 వేల కోట్లు ఇచ్చింది నిజం కాదా అని…
Droupadi Murmu: ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నాడు నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం.. వరాహ స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి దర్శనానికి ఆలయ మహాద్వారం చేరుకుని అక్కడి నుంచి తిరుమలేశుడి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో…
Andhra Pradesh: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు, కుర్చీలు పగిలిపోగా, కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సదుంలో రైతు భేరి నిర్వహిస్తామని చెప్పడంతోనే వైసీపీ శ్రేణులు పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు.…
CPI Ramakrishna: ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఏపీలో జగన్ పాలనలో అన్నీ రివర్స్‌లో జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎక్కడైనా చిన్న పార్టీలు, ప్రతిపక్షాలు ఉద్యమించడం చూశామని.. కానీ ఏపీలో వైసీపీనే ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు. కర్నూలు వేదికగా రాయలసీమ గర్జనను వైసీపీనే ముందుండి నడిపిస్తుందని.. ఇది ప్రజలను దారుణంగా…
Andhra Pradesh: ఏపీలో మూడు రాజధానుల రాజకీయం నడుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తీరుతామని ప్రభుత్వం తెగేసి చెప్తోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈరోజు కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభ జరగనుంది. వైసీపీ మద్దతుతో ఈ సభను నాన్ పొలిటికల్ జేఏసీ భారీ ఎత్తున నిర్వహించనుంది. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ బహిరంగ సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.…