చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌ను పరామర్శించడానికి బీసీ సంఘాలు, యాదవ సంఘాలు ఛలో పుంగనూరు కార్యక్రమం తలపెడితే.. మరోవైపు గత ఎన్నికల సమయంలో ఓట్లు కోసం ఇచ్చిన టోకన్స్ కు ఇప్పుడైనా డబ్బులు ఇవ్వాలంటూ.. పుంగనూరులో బోర్డులు, బ్యానర్లు వెలిశాయి. దీంతో ఎప్పుడూ ఎమీ జరుగుతోందనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది.. దీంతో పుంగనూరులో భారీగా మోహరించారు పోలీసులు. జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు, సభలకు…
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తీరం వైపు దూసుకొస్తుంది.. దక్షిణ అండమాన్‌లో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి నిన్న ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారిపోయింది.. ఇవాళ సాయంత్రానికి తుఫాన్‌గా మారుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.. పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి రేపు ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో తీరం దిశగా రాబోతోంది.. ఆ తర్వాత పశ్చిమ వాయువ్యంగానే పయనిస్తూ ఈనెల 9వ తేదీ రాత్రి లేదా 10న…
బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కేబినెట్లో బీసీలకు భారీగా అవకాశాలు కల్పించారు.. కిందిస్థాయిలో కూడా బీసీలకు పెద్దపీఠవేశారు.. ఇక, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాల ప్రజలను ఏం చేశామని చెప్పేందుకు సిద్ధం అవుతోంది వైసీపీ.. దీనికోసం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సి పల్ స్టేడియం వేదికగా నేడు జయహో బీసీ మహాసభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.. 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో…
* నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే.. ఢాకా వేదికగా ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ * నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమవేశాలు.. 16 బిల్లులను ప్రవేశపెట్టెందేకు ప్రభుత్వం ప్రయత్నాలు * నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం.. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, భారీ బహిరంగసభలో పాల్గొననున్న తెలంగాణ సీఎం * విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేడు జయహో బీసీ మహాసభ.. బీసీ…
Botsa Satyanarayana: అమరావతి సచివాలయంలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. 62 ఏళ్ళకు పదవీ విరమణ అంశాన్ని గురుకుల టీచర్లు, కార్పొరేషన్లకు కూడా అమలు చేయాలని ఉద్యోగులు కోరారని.. న్యాయపరమైన చిక్కులు లేని సందర్భంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పామని మంత్రి బొత్స చెప్పారు. ఈ సమావేశానికి సీపీఎస్ ఉద్యోగులను పిలవలేదన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమాచారం సీపీఎస్ భేటీగా…
CM Jagan: ఏపీ సీఎం జగన్ బుధవారం నాడు విజయవాడ, నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు సీఎం జగన్ హాజరుకానున్నారుఉదయం 11:50 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభ జరగనుంది. ఈ సభ ముగిసిన తర్వాత సీఎం జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం…
Vasireddy Padma: ఏపీలో కృష్ణా జిల్లాకు చెందిన మెడికో విద్యార్థిని హత్య కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఈ అంశంపై స్పందించారు. మెడికో విద్యార్థిని హత్య దారుణమని.. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ స్నేహాలు విషాన్ని చిమ్ముతున్నాయని ఇప్పటికైనా యువత తెలుసుకోవాలని ఆమె సూచించారు. సోషల్ మీడియాలో పుట్టే ప్రేమలను మనం అంచనా వేయలేమని అభిప్రాయపడ్డారు. ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నట్లు తపస్వి ఒక్కమాట కూడా చెప్పలేదని తల్లిదండ్రులు అంటున్నారని.. పథకం…
Andhra Pradesh: అమరావతి సచివాలయంలో సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశమైంది. బ్లాక్ 2లో ఆర్ధిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జీవోఎం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అటు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు, సూర్య నారాయణ, వెంకట్రామి రెడ్డి, ఇతర నేతలు సీపీఎస్ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు ఈ కీలక సమావేశానికి హాజరుకాగా…