నేడు రెండు జిల్లాల్లో సీఎం పర్యటన..
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఇవాళ తిరుపతి, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఉదయం నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు సీఎం వైఎస్ జగన్.. జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.. ధర్మారెడ్డి కుమారుడి మృతితో దుఖఃసాగరంలో పారుమంచాల మునిగిపోయింది.. గుండెపోటుతో చెన్నైలో చికిత్స పొందుతూ మృతిచెందిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి భౌతికకాయానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. ఇప్పటికే పారుమంచాలకు చంద్రమౌళి మృతదేహాన్ని తరలించారు.. చంద్రమౌళి భౌతికకాయాన్ని సందర్శించి సీఎం జగన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు.. ఇక, సాయంత్రం తిరుపతికి వెళ్లనున్నారు వైఎస్ జగన్.. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. సాయంత్రం 5 .15కు తుమ్మలగుంట చేరుకోనున్నారు.. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో అరగంటపాటు గడపనున్నారు.. తిరిగి సాయంత్రం 6 గంటలకు తుమ్మలగుంట నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆయన.. 6.15కి రేణిగుంట నుంచి గన్నవరం బయల్దేరనున్నారు..
జేసీ ట్రావెల్స్ కేసులో రంగంలోకి సీబీఐ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీబీఐ సోదాలు మరోసారి హాట్ టాపిగ్గా మారాయి. జేసీ ఫ్యామిలీ.. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా అక్రమంగా విక్రయించిందన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం.. పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డికి చెందిన జఠధార ఇండస్ట్రీస్ కార్యాలయంతో పాటు, ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కీలకమ్తెన డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు సమాచారం. నిన్న రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఇదే కేసులో ఈడీ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే జేసీ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సంస్థకు చెందిన 22 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. జఠధార ఇండస్ట్రీస్, గోపాల్ రెడ్డి అండ్ కో కంపెనీలు… అశోక్‌లేలాండ్ నుంచి తక్కువ ధరకే బీఎస్-4 వాహనాలను కొనుగోలు చేసి… నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించారనేది జేసీపై ప్రధాన అభియోగం. దాదాపు 38 కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగినట్లు గుర్తించామని ఈడీ ప్రకటించింది.
వెదర్ అప్‌డేట్..
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి మరో 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ”హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంది.. నగరంలో తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. 6 నుంచి 8 వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తూర్పు మరియు ఈశాన్యం నుండి కి.మీ.” అని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు ట్వీట్ చేశారు.
దిగ్విజయ్‌తో కోమటిరెడ్డి చర్చలు
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం దిగ్విజయ్ సింగ్ తో భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిన్న రాత్రి భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నేడు నేను ఉండటం లేదు అందుకే దిగ్విజయ్ సింగ్ ని నిన్న కలిసా అన్నారు. నా మిత్రుడు టీటీడీ ఈవో కుమారుడు మరణించాడు వారికి సంతాపం తెలపడానికి ఇవాళ నందికొట్కూరు వెళ్తున్నట్లు తెలిపారు. 2018 ఎన్నికల తరువాత నుంచి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించా అన్నారు. 20 నిమిషాల పాటు పార్టీ పరిస్థితుల పై చర్చించానని తెలిపారు. పీసీసీతో పాటు ఇతర అంశాలపై చర్చించానని అన్నారు. వారు కొన్ని సూచనలు చేశారు.. నేను నా ఆలోచనని వారితో పంచుకున్నానని అన్నారు. తరువాత ఢిల్లీ వెళ్లి.. అక్కడ ఆయనతో కూర్చుని మాట్లాడుతా అన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
గడగడలాడిస్తోన్న బర్డ్ ఫ్లూ.. ఏడాదిలో 5కోట్ల పక్షులు హతం
యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ(ఈఎఫ్ఎస్ఏ) నివేదిక ప్రకారం ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 2021 నుండి సెప్టెంబర్ 2022 వరకు ఏడు దేశాలలో పౌల్ట్రీలో 2,520 సార్లు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వ్యాప్తిని గుర్తించినట్లు తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు ఐదుకోట్లకు పైగా పక్షులను చంపినట్లు వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముందస్తుగా వధించిన కోళ్లు, బాతులు, టర్కీలను ఇందులో చేర్చలేదని ఈఎఫ్‌ఎస్‌ఏ తెలిపింది.
వీడు మామూలోడు కాదు.. గడ్డంతో గిన్నీస్ రికార్డ్
అమెరికాలోని ఇడాహోకు చెందిన జోయల్ స్ట్రాసర్ అనే వ్యక్తి తన గడ్డాన్ని అపురూపంగా పెంచుకుంటున్నాడు. నిత్యం ఎంతో అందంగా అలంకరించుకుంటాడు. గడ్డం ఆరోగ్యం కోసం ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాడు. రికార్డులు సృష్టించడంతో గడ్డం అడ్డం కాదని, అదే గడ్డంతో నాలుగు గిన్నిస్ రికార్డులు కొట్టేశాడు. ఈయన మొత్తం తొమ్మిది గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకోవడం విశేషం.
వచ్చేసింది సోలార్ కుక్కర్
దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) ధర రోజురోజుకూ పెరుగుతోంది. అందువలన ప్రజలు ఇండక్షన్ ఉపయోగించడం ప్రారంభించారు. అయితే కరెంటు బిల్లుకు భారీగానే ఖర్చు అవుతుంది. ఈ రెండింటినీ నివారించేందుకు, మీ డబ్బును ఆదా చేయడానికి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సూర్య నూతన్ అనే సోలార్ కుక్కర్‌ను పరిచయం చేసింది. ఈ సూర్య నూతన్ ఓవెన్ పాత సోలార్ ఓవెన్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అంటే ఈ సోలార్ ఓవెన్ పైకప్పుపై లేదా ఎండలో ఉంచాల్సిన అవసరం లేదు. కానీ సూర్య నూతన్ ఓవెన్‌ను వంటగదిలో సులభంగా అమర్చవచ్చు. అంతే కాకుండా, ఇది సాధారణ పొయ్యిలా కనిపిస్తుంది. ఈ ఓవెన్ రెండు యూనిట్లలో లభిస్తుంది. కాబట్టి ఒక యూనిట్ వంటగదిలో మరొకటి ఎండలో ఉంచబడుతుంది. సౌర శక్తిని థర్మల్ శక్తిగా మార్చే థర్మల్ బ్యాటరీని కూడా ఇందులో అమర్చారు. ఇది రాత్రిపూట కూడా ఉపయోగించవచ్చు. దీని కనీస ధర 12 వేల రూపాయలు మరియు టాప్ వేరియంట్ ధర 23 వేల రూపాయలు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఇంకా మార్కెట్లోకి విడుదల కాలేదు. అయితే త్వరలో మార్కెట్లో విక్రయానికి వచ్చే అవకాశం ఉంది.
రెండో టెస్ట్ మ్యాచ్‌పై టీమిండియా గురి..
మీర్పూర్ వేదికగా… భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం అయ్యింది.. తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా… రెండో టెస్టులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. తొలి టెస్టులో టీమిండియా అన్ని రంగాల్లో సమష్టిగా రాణించింది. ఓపెనర్లు, మిడిలార్డర్‌తో పాటు టెయిలెండర్లు అద్భుతంగా రాణించారు. చతేశ్వర్ పూజారా, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారీ స్కోరుకి పునాదులు వేశారు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్…అసాధారణ బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ ఒక్కటే కాదు.. బౌలింగ్‌లోనూ టీమిండియా పటిష్టంగా ఉంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అశ్విన్, అక్షర్ పటేల్…బంగ్లా బ్యాటర్లను చుట్టేశారు. ఇక, రెండో టెస్ట్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. బ్యాటింగ్ ఎంచుకుంది.. ఇక, తుది జట్టులో కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుబమ్‌గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జాదవ్, ఉమేష్ యాదవ్, సిరాజ్‌కు చోటు దక్కింది.
కేరళలో మొదటి ఐమాక్స్ థియేటర్ ప్రారంభం..
సినిమా ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కేరళలోని మొదటి ఐమాక్స్ థియేటర్ తిరువనంతపురంలో ప్రారంభమంది. లులు మాల్‌లోని పీవీఆర్ సూపర్‌ప్లెక్స్‌లో ఐమాక్స్ స్క్రీనింగ్ ప్రారంభమైంది. ప్రారంభ చిత్రం హాలీవుడ్ చిత్రం అవతార్ ది వే ఆఫ్ వాటర్. డిసెంబర్ 16న అవతార్ విడుదలైన రోజున తిరువనంతపురంలోని ఐమాక్స్ ని ప్రారంభిస్తామని మేకర్స్ మొదట ప్రకటించారు, కానీ అది జరగలేదు. అందుబాటులోకి వచ్చిన మొదటి రోజు థియేటర్ కు మంచి స్పందన వచ్చింది. అవతార్ విడుదలై కొన్ని రోజులు కావస్తున్నా ఐమాక్స్ లో సినిమా చూసేందుకు సినీ ప్రియులు ఎగబడ్డారు. టిక్కెట్ ధరలు రూ.1230, రూ.930, రూ.830