మాస్క్ తప్పనిసరి.. కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
కొత్త వేరియంట్ రూపంలో కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే గుర్తించి అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. విమానాశ్రయంలో ప్యాసింజర్ స్క్రీనింగ్‌తో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పాజిటివ్ కేసుల నమూనాలను పంపాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్‌తో కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌ల వాడకాన్ని ప్రోత్సహించాలని, కరోనా ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌లో ఉంది. డిసెంబర్ 21న తెలంగాణలో ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 34 మాత్రమే అని ఆరోగ్య శాఖ ప్రకటించింది. బీఎఫ్ 7 వేరియంట్ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తున్నామని, వారి నమూనాలను పరిశీలిస్తున్నామని వివరించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపబడింది.
దేశంలో కోవిడ్ పై మోడీ సమీక్ష.. రాష్ట్రాలకు దిశా నిర్దేశం
దేశంలో కోవిడ్ పరిస్థితులు,కొత్త వేరియంట్ల కట్టడిపై సమీక్షించారు ప్రధాని మోడీ.. కోవిడ్ పరిస్థితులపై ప్రారంభమైన ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి వర్చువల్ భేటీలో పాల్గొన్న కీలక మంత్రిత్వ శాఖల మంత్రులు,కేంద్ర ఆరోగ్య శాఖ,పిఎంఓ అధికారులు.. కోవిడ్ కొత్త వేరియంట్ల కట్టడి సన్నద్ధత ,రాష్ట్రాలను అప్రమత్తం చేయడం,కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ప్రధానికి వివరణ ఇచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి. దేశంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్.. కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు కావాల్సిన సమాయత్తంపై సమీక్షించారు.
లియోనల్ మెస్సీకి ఘనస్వాగతం.. జన్మధన్యం
లియోనల్ మెస్సీ.. పేరు వినగానే ఫుట్ బాల్ ప్రేమికులు ఊగిపోతున్నారు. ఫిఫా ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టు విజయోత్సవ వేడుకలలో భాగంగా ఆటగాళ్ల పరేడ్‌ను నిర్వహించారు. మంగళవారం జాతీయ సెలవుదినంగా ప్రకటించడంతో మెస్సీని చూసేందుకు తరలివచ్చారు అక్కడి జనం. ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా గెలవడం కోట్లాది మంది అభిమానులను ఆనందపరవశుల్ని చేసిం. ఆ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన మెస్సీ సేనకు స్వాగతం పలకడానికి ఏకంగా 40 లక్షల మంది రోడ్లపైకి రావడం కూడా మనం చూశాం. హెలికాప్టర్ ద్వారా మెస్సీ సేనకు పూలవర్షం కురిపించి.. అద్భుతమయిన స్వాగతం పలికారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చిన్నాపెద్దా, ఆడమగా తేడా లేకుండా అంతా రోడ్లమీదకు వచ్చారు. జనసంద్రం రోడ్లమీదకు రావడంతో అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదంటున్నారు. అర్జెంటీనాకు 36 ఏళ్ల తర్వాత మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన మెస్సీని అభిమానులు ఆకాశానికి ఎత్తేశారు. నీ జన్మధన్యం అయిందంటూ కామెంట్లు చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అర్జెంటీనా సెంట్రల్ బ్యాంక్ అక్కడి 1000 పెసో బ్యాంక్‌నోట్‌పై మెస్సీ ఫొటోను ముద్రించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచిందనే వార్తలు వచ్చాయి. సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఈ ప్రతిపాదన చేశారని, అక్కడి ఫైనాన్షియల్ న్యూస్‌పేపర్ ఎల్ ఫైనాన్సియెరో వెల్లడించిందని వార్తలు వచ్చాయి.
పామాయిల్ పంట సాగుకి తెలంగాణలో 15శాతం అనుకూలభూమి
దేశ వ్యాప్తంగా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా ఉన్న భూమిలో 15% భూమి తెలంగాణలోనే ఉందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ – ఆయిల్ పామ్ కార్యక్రమం తెలంగాణ రైతులకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2021-22 నుండి 2025-26 వరకు 5 సంవత్సరాల కాలానికి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ – ఆయిల్ పామ్ కార్యక్రమానికి ఆమోదం తెలిపిందని అన్నారు. పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశంలో 2019-20 నాటికి 3.5 లక్షల హెక్టార్లలో ఉన్న పామాయిల్ సాగును 2025-26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచి, మరో 6.5 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలలో 3.28 లక్షల హెక్టార్ల భూమిని, మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 3.22 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలని లక్ష్యమన్నారు.
ఏం చేయాలో చంద్రబాబుకు స్పష్టతలేదు.. ఏ రాష్ట్రంలో ఉన్నాడో ఆయనకే తెలీదు
తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. ఖమ్మం జిల్లాలో టీడీపీ బహిరంగసభపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో ప్రజలకు సేవ చేయాలని ఉంటే మంచిది.. ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదన్న ఆయన.. రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట అని మండిపడ్డారు.. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తెలంగాణకు వెళ్లాడు.. కానీ, ఏం చేయాలో కూడా చంద్రబాబుకు స్పష్టత లేదన్నారు.. రాష్ట్ర విభజనపై ఉన్నట్టుండి చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్రం అన్యాయంగా విడిపోయింది, సేవ చేయాలి అనే క్లారిటీ సీఎం వైఎస్ జగన్‌కు ఉందని స్పష్టం చేశారు.. అయితే, నాతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో ఉపయోగం ఉంటుందని బీజేపీకి చెప్పడమే బాబు ఉద్దేశంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ తెచ్చే ఏ పథకమైనా పేదల కోసమే
బీఆర్‌ఎస్ ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా అది పేదల కోసమేనని అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జీవన్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం కవిత మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రూ.లక్ష సాయం అందిస్తున్నామని తెలిపారు. నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లికి 116 లక్షలు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారా అని అడిగారు. గతంలో కరెంటు కోసం ఎన్నో కష్టాలు పడ్డామని, నేడు తెలంగాణలో కరెంటు పోతే వార్త అని అన్నారు. నిజామాబాద్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. నగరంలో పాత భవనాలను కూల్చివేసి ప్రభుత్వ భవనాలు నిర్మిస్తామన్నారు. పాత బస్టాండ్‌ను తొలగించి రైల్వేస్టేషన్‌కు సమీపంలో కొత్తది నిర్మిస్తామన్నారు.
చైనా నుంచి వచ్చే విమానాల నిలుపుదల.. కేంద్రం స్పందన ఇదే..
కరోనా మహమ్మారికి జన్మస్థలం అయిన చైనా ఎప్పుడూ లేని విధంగా మహమ్మారి బారినపడి అల్లాడుతోంది. గతంలో రోజుల వ్యవధిలో అక్కడ వేల కేసులు నమోదు అయితే.. ప్రస్తుతం గంటల్లోనే వేల కేసులు నమోదు అవుతున్నాయి. చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగింది. శ్మశాన వాటికల్లో పనిచేసేందుకు సిబ్బంది కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ‘జీరో కోవిడ్’ విధానాన్ని చైనా ఎత్తేయడంతో అక్కడ కేసుల సంఖ్య అదుపుతప్పింది. అత్యంత వేగంగా ఇన్ఫెక్షన్ కు గురిచేసే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 చైనాలో వ్యాప్తి చెందుతోంది. రాజధాని బీజింగ్ తో పాటు వాణిజ్య రాజధాని షాంఘైలో కేసులు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ బీఎఫ్-7 వేరియంట్ పై భారత్ కూడా అప్రమత్తం అయింది. ప్రధాని నరేంద్రమోదీ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వరసగా అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభించారు. ర్యాండమ్ గా ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు చేయనున్నారు. ఇక కేరళ, ఢిల్లీ, తెలంగాణ ఇతర రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, బూస్టర్ డోసులు వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది.
తాజ్ మహల్ చూడాలంటే.. కరోనా టెస్ట్ తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. చైనా వ్యాప్తంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 విస్తరిస్తోంది. కరోనా ప్రారంభం అయిన గత మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం రానున్న మూడు నెలల్లో చైనాలో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు. మూడు నెలల్లో మూడు కరోనా వేవ్ లు చైనాను దెబ్బకొడతాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే బీఎఫ్-7 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో భారత్ కూడా అప్రమత్తం అయింది. ఇప్పటికే ఈ వేరియంట్ దేశంలో నలుగురికి సోకింది. దీంతో బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని.. నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. గురువారం భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కరోనాపై సమావేశం జరుగుతోంది. ఇక కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఆయా రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
చెప్పుదాడి ఘటనపై కన్నడ స్టార్ హీరో దర్శన స్పందన
కన్నడ స్టార్ హీరో దర్శన్ పై చెప్పుదాడి సంఘటన ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శన్ సినిమా క్రాంతి పాట విడుదల కార్యక్రమంలో భాగంగా హోస్ పేటలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో దర్శన్ పై ఒక వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే విసిరినా వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్ అని, పునీత్ పై దర్శన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం నచ్చని అతను దర్శన్ ఫై చెప్పు విసిరాడని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే అందులో నిజం లేదని పునీత్ అన్న శివ రాజ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ఘటనపై కన్నడ స్టార్ హీరోలు అందరు స్పందించారు. ఈ ఘటన కన్నడ ఇండస్ట్రీకి సిగ్గుచేటు అని, కన్నడ ఇండస్ట్రీ గురించి మిగతా ఇండస్ట్రీ వారు తప్పుగా అనుకొనే ప్రమాదం ఉందని దయచేసి ఇలాంటి ఘటనలను ఆపాలని చెప్పుకొచ్చారు. అయితే ఎట్టకేలకు ఈ వివాదంపై హీరో దర్శన్ నోరు విప్పాడు.