YSR Ghat: ఇడుపులపాయలో వైఎస్ జగన్ పర్యటన.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.. మూడు రోజులపాటు జిల్లా పర్యటనలో భాగంగా నిన్న ఇడుపులపాయకు చేరుకున్నారు. నిన్న కడప, కమలాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకుని ఇడుపులపాయకు వెళ్లిన సీఎం.. ఇవాళ ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. అనంతరం వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు..
Read Also: TTD: వైకుంఠ ద్వార దర్శనానికి ఫుల్ డిమాండ్.. 45 నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు..
Also Read
- New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
- AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
- Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
- Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఇక, ఇవాళ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం 12.30గంటలకు ఇడుపులపాయ నుంచి భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకోనున్న ఆయన.. మధ్యాహ్నం 1.10గంటల నుంచి 1.20 వరకు విజయ హోమ్స్ వద్ద ఉన్న జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 1.30 నుంచి 1.45గంటల వరకు కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును, 1.50 నుంచి 2గంటల వరకు నూతన కూరగాయల మార్కెట్‌ను, 2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లేఅవుట్‌లో వైఎస్సార్ మెమోరియల్ పార్క్‌ను ప్రారంభించనున్నారు.. ఇక, 2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం నూతన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. 3గంటల నుండి 3.30గంటల వరకు డాక్టర్ వైఎస్సార్ బస్ టర్మినల్‌ను ప్రారంభించి బస్టాండు ఆవరణంలో ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారు సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 3.35 గంటల నుంచి 3.55గంటల వరకు నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం స్కూలును ప్రారంభిస్తారు ఏపీ సీఎం… 4.05గంటల నుంచి 4.20గంటల వరకు మురుగునీటిశుద్ధి కేంద్రాన్ని, 4.30గంటల నుంచి 4.45గంటల వరకు గార్బేజీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 5.00గంటలకు భాకరాపురం హెలీఫ్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి ఇడుపులపాయకు వెళ్తారు.. ఇక, ఆదివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే క్రిస్మస్ కేక్‌ను కట్ చేస్తారు సీఎం వైఎస్ జగన్..





తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?