TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియు ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా.. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది టీటీడీ.. రోజుకు రెండు వేల టికెట్ల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300 దర్శన టికెట్ కొనుగోలు చేయాలి… ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహాలఘు దర్శనం కల్పించనున్నారు..
Read Also: IndiGo: ఇండిగో స్పెషల్ ఆఫర్.. రూ.2 వేలకే టికెట్..
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
మరోవైపు కొత్త ఏడాది ప్రారంభంలోనూ తిరుమలకు భక్తులు పోటెత్తుతారు.. ఆ రద్దీని కూడా దృష్టిలో ఉంచుకుని.. జనవరి 1 మరియు వైకుంఠ ద్వార దర్శనానికి జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు ప్రత్యేక కోటాకు సంభందించిన టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు.. రోజుకి 20 వేల చొప్పున.. 2.2 లక్షల టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. ఇక, వైకుంఠ ద్వార దర్శనానికి ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. గతంలో కంటే ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా చర్యలు చేపట్టింది.. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసింది.. అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.. 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి జరగనుండగా.. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..