Special Trains for Sankranti: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో 16 ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఎలాగైనా.. ఎన్ని కష్టాలు భరించైనా సొంత ఊరికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు తెలుగు ప్రజలు.. దీంతో, పండు సీజన్‌లో విమానాలు, రైళ్లు, బస్సులు.. ఇలా ఏవి ఆశ్రయించినా ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. దీంతో, సొంత వాహనాల్లో కూడా ఊరికి వెళ్లేవారు ఉన్నారు.. అయితే, సంక్రాంతి పండుగకు మరో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే… ఇప్పటికే సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.. అయినా, ప్రయాణికుల నుంచి డిమాండ్ కొనసాగుతూనే ఉంది. దీంతో, ప్రయాణికులకు మరికొంత ఉపశమనం కలిగించేలా.. మరో 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. జనవరి 1 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడుపనున్నారు. గతంలో ప్రకటించిన రైళ్లకు ఈ సర్వీసులు అదనం.
Read Also: Narayana Swamy: రాజకీయ పరిజ్ఞానం లేని లోకేష్ నీకెందుకు పాదయాత్ర..?
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్ నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు అధికారులు.. సంక్రాంతి సీజన్‌లో ఈ మార్గాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చారు.. ప్రత్యేక రైళ్లలో రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ బోగీలను అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను రాత్రి పూట నడుపనున్నారు. ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ కేంద్రాల్లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ లేని ప్రయాణాలకు యూటీఎస్ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్‌చేసుకోవచ్చు.. మరోవైపు, నూతన సంవత్సరం సందర్భంగా 31వ తేదీన అర్ధరాత్రి తర్వాత కూడా ఎంఎంటీఎస్ రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి ఫలక్ నుమాకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఇక, న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు ప్రకటించారు.. 31న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు తిరగనున్నాయి.. రాత్రి ఒకటి గంటకు మొదటి స్టేషన్ నుండి బయల్దేరనున్న చివరి మెట్రో రైలు.. రెండు గంటలకు గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.
కాగా, సంక్రాంతి పండుగ దృష్ట్యా, దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాల మధ్య 92 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.. ప్రత్యేక రైలు సర్వీసులు వివిధ కోచ్ కూర్పును కలిగి ఉంటాయి, వీటిలో రిజర్వ్‌డ్ మరియు అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు అన్ని విభాగాల ప్రయాణికులకు సేవలు అందజేస్తాయని అధికారులు వెల్లడించారు.. రిజర్వ్ చేయబడిన వసతి కోరుకునే ప్రయాణికులు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు కాకుండా IRCTC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు మొబైల్ యాప్ ద్వారా తమ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు; తద్వారా టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడడం మానుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పుడు.. మరో 16 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చేశాయి.
తాజావార్తలు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!