నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.. స్థానిక రాజకీయనాయకుని వాహనానికి సైడు ఇవ్వలేదని ట్రాక్టర్ డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి ఏఎస్సై కొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.. ఇక, తన బావకోసం వెళ్లిన మహిళను కూడా కొట్టారని.. ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలుస్తోంది.. ఏఎస్సై మద్యం సేవించి కొట్టినట్లు బాధిత మహిళ వాపోయింది.. దీంతో, పెద్ద ఎత్తున పీఎస్ దగ్గరకు చేరుకున్న మహిళా బంధువులు.. స్టేషన్ ముందు పోలీసులతో వాగ్వాదానికి దిగారు..…
సంక్రాంతి సమయంలో ప్రత్యేక బస్సులు నడుపుతూ అదనపు ఛార్జీలు వసూలు చేయడం చూస్తూ వచ్చాం.. ఆర్టీసీకి కూడా దీనికి మినహాయింపు ఏమీకాదు.. ఇక, ప్రైవేట్ ట్రావెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. పండుగలను క్యాష్ చేసుకునే పనిలో భాగంగా.. అదనంగా బాదేస్తూనే ఉన్నారు.. అయితే, సంక్రాంతి సమయంలో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ.. ఇప్పటికే ఆన్లైన్లో సంక్రాంత్రికి బుకింగ్స్ ప్రారంభించింది ఆర్టీసీ.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.. www.apsrtconline.in…
Gudivada Casino Case: గుడివాడ క్యాసినో ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చిన విషయం విదితమే… ఈ కేసులో ఇవాళ ఆదాయపన్నుశాఖ (ఐటీ) విచారణ చేపట్టనున్నారు.. గుడివాడ క్యాసినో విషయంలో సమాచారం అందించాల్సిందిగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు జారీ చేసింది.. గుడివాడ క్యాసినో అంశమై మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వివిధ సంస్థలకు అటే సీబీడీటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు తెలుగుదేశం…
* నేడు ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి.. ఉదయం 10.30కి ఈడీ ఆఫీసుకి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి. * నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన.. గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు * ఇవాళ ఢిల్లీకి బండి సంజయ్.. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొననున్న బండి సంజయ్ * అనంతపురం: గుంతకల్ రైల్వే డివిజన్లో సిగ్నలింగ్ మరమ్మతుల కారణంగా నేటి…
మంత్రి పినిపె విశ్వరూప్ రాజకీయ వారసుడిగా చిన్న కొడుకు శ్రీక్రాంత్ ఎంట్రీకి వైసీపీ అధిష్ఠానం ఓకే చెప్పిందట. విశ్వరూప్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అమలాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కుమారుడిని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేశారట. దీంతో కొంతకాలంగా విశ్వరూప్ వారసుడి ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఇటీవల ముంబైలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు మంత్రి. హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటూ.. అప్పుడప్పుడూ అమలాపురం, తాడేపల్లికి వచ్చి వెళ్తున్నారు. దీంతో…
విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే కాగా.. ఈ నెల 21న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. 21వ తేదీన బాపట్ల జిల్లాలో ట్యాబ్ల…
కాంగ్రెస్ సీనియర్లకు మల్లు రవి కౌంటర్.. కాంగ్రెస్ సీనియర్లకు కౌంటర్ ఇచ్చారు మరో సీనియర్ నేత మల్లు రవి.. ఏ కమిటీల్లో ఎవరి సంఖ్య ఏ స్థాయిలో ఉందే చెప్పుకొచ్చారు మల్లు రవి.. 22 మందితో ఉన్న పీఏసీ కమిటీలో రేవంత్రెడ్డి మినహా టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేసిన ఆయన.. ఇక, 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇద్దరే టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఉన్నారు.. ఉపాధ్యక్ష పదవిలో 24 మందిలో ఐదుగురు టీడీపీ…
రానున్న రెండేళ్లలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిబోతోంది.. నేటి యువతరంలో ఉన్న నైపుణ్యం, ప్రతిభ పాటవాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గైట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలి గ్రాడ్యుయేషన్ ఉత్సవం నిర్వహించారు.. ఈ సభకు అధ్యక్షత వహించిన గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శశీ కిరణ్ వర్మ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనేక ఆవిష్కరణలు వినూత్నంగా చేస్తున్న…