పెన్షనర్లకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పెన్షన్‌ను దశల వారీగా పెంచుతామని, మొత్తం రూ. 3,000 అందిస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఆ హామీ మేరకు ఏటా రూ. 250 చొప్పున పెన్షన్‌ను పెంచుతూ వస్తున్నారు.. అందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. పాత లబ్దిదారులే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2.31 లక్షల మందికి కూడా పెన్షన్ మంజూరు చేసింది సర్కార్.. ఆదివారం అయినప్పటికీ.. జనవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ పంపిణీ ప్రారంభించనున్నారు.. ఇక, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ వారోత్సవాలు నిర్వహించబోతున్నారు.. జనవరి 1 వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు పెన్షన్ వారోత్సవాలు జరగనున్నాయి.. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలో పెన్షన్ వారోత్సవాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు.
Read Also: Chandrababu Naidu: నా ప్రాణాలు అడ్డుపెట్టైనా పార్టీ కోసం పనిచేసేవారిని కాపాడుకుంటా..
అయితే, పెన్షన్ మొత్తం ఇప్పటి వరకు రూ. 2,500 ఉండగా.. రేపటి నుంచి రూ.250 పెరగనుంది.. దీంతో.. లబ్ధిదారులకు రూ.2,750 చొప్పున పంపిణీ చేయనున్నారు.. 2,31,463 మందికి కొత్త పెన్షన్లు కలుపుకుంటే.. మొత్తం 64.06 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తారు.. దీని కోసం జగన్మోహన్‌రెడ్డి సర్కార్ రూ.1765 కోట్లు ఖర్చు చేస్తోంది.. కాగా, వివిధ పథకాల లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్న విషయం విదితమే.. సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా.. అమలు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.