New Political Party For Uttarandhra: ఉత్తరాంధ్ర కోసం కొత్త పార్టీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్‌గా కొనసాగుతూనే ఉంది.. మా విధానం మూడు రాజధానులు. మా నిధానం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి… ఇదే మా లక్ష్యం అంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. మూడు రాజధానుల వ్యవహారం కోర్టులో ఉంది. అమరావతి సంగతి తేలితే కానీ మూడు రాజధానుల కాన్సెస్ట్ ఫైనల్ కాదు. అయితే ఈ లోగా కొత్త కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. అమరావతే రాజధాని అంటే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. అమరావతిలో భూములన్నీ కొనేసిన చంద్రబాబు… అక్కడే రాజధాని పెట్టి దాన్ని మరో హైదరాబాద్ చేయాలని చూస్తున్నారని… దానికి తాము అంగీకరించబోమని అన్నారు మంత్రి. ఒకవేళ అమరావతే రాజధాని గా ఉంటుంది అంటే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్రను రాష్ట్రం చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్ర భుత్వంలో మంత్రిగా ఉన్న ధర్మాన ఇలా మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ధర్మాన ఎందుకు ఇలా మాట్లాడారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే…. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పడమే ధర్మాన ఉద్దేశం అంటున్నారు. ఒకవేళ అలా కాకుంటే అమరావతితో ఉత్తరాంధ్రకు వచ్చే నష్టాన్ని జనానికి వివరించి చెప్పడానికే ధర్మాన అలా అని ఉంటారని అంటున్నారు. విడిపోయి ఇప్పటికే నానాఇబ్బందిపడుతున్న రాష్ట్రాన్ని మళ్లీ ముక్కలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మరోవైపు ఉత్తరాంధ్ర రాష్ర్టం ఎజెండాగా జై ఉత్తరాంధ్ర పేరుతో పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దమౌతుంది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ర్టం సాధించడం ద్వారానే అభివృధ్ది సాధ్యం అంటూ వక్తలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ నినాదం ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!