యార్లగడ్డపై నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. ముందే నిర్ణయం తీసుకున్నారేమో..!
గవన్నరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఇదే సమయంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు యార్లగడ్డ.. సజ్జల వ్యాఖ్యలు తనను బాధకు గురి చేశాయన్న ఆయన.. KDCC బ్యాంక్ ను అభివృద్ది చేసినా పనికి రాను అని పక్కన పెట్టారని.. టీడీపీ కంచుకోట గన్నవరంలో వైసీపీకి అభివృద్ధి చేశానన్నారు. గన్నవరం అభ్యర్ధిగా నేను సరిపోను అని అన్నారు.. పార్టీకి ఇంత పని చేస్తే నాకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదు.. మూడేళ్లుగా నాకు ప్రత్యామ్నాయం చూపలేదు.. తడి గుడ్డతో గొంతు కోశారంటూ ఎమోషనల్ అయ్యారు యార్లగడ్డ.. అయితే, శుక్రవారం రోజు యార్లగడ్డ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అయితే, పోతే పో అని నేనట్లు మీడియా వక్రీకరించి రాసిందన్నారు సజ్జల.. అలా నేనెందుకు అంటాను? అని ప్రశ్నించిన ఆయన.. నేనే కాదు మా పార్టీలో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. నాయకులంటే ఇంట్లో పని చేసే వారా అలా అనటానికి? యార్లగడ్డ.. టీడీపీతో కాంటాక్ట్ లో ఉన్నారని ఎవరూ అనలేదని స్పష్టం చేశారు. మీడియాలో కథనాలు రాశారేమో అన్నారు. అతనికి భవిష్యత్తు ఉంటుందని నాలాంటి వాళ్లు చెప్పారన్నారు సజ్జల. సీఎం వైఎస్ జగన్‌ని కలవాలి అనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. కాగా, వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించిన యార్లగడ్డ వెంకట్రావు.. తనతో పాటు చాలా మంది వైసీపీకి రాజీనామా చేస్తారని పేర్కొన్నారు.. అంతే కాదు.. వైఎస్ జగన్‌ను కలవడానికి అవకాశం దొరకడం లేదన్నారు. కడప నుంచి ఆయన గెలుస్తాడు.. గన్నవరం నుంచి నేను గెలిచి అసెంబ్లీలో వైఎస్ జగన్‌ను కలుస్తానంటూ యార్లగడ్డ వెంకట్రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
విడిగా పోటీ చేసినా.. కలిసి పోటీ చేసినా.. ఆ ఇద్దరు కలిసే ఉన్నారు..
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బేరం పెంచుకోవడాని పవన్ కల్యాణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ ఓటు చీలకూడదని అంటేనే ఎంత మందితో అయినా పొత్తు పెట్టుకుంటాడని అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ విధానం చూస్తేనే వెనుక చంద్రబాబు ఉన్నాడని స్పష్టం అవుతుందన్న ఆయన.. చంద్రబాబు ఎలా చెబితే పవన్ కల్యాణ్ అలానే చేస్తాడు.. విడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసే ఉన్నారు.. చెప్పేది చంద్రబాబు అయితే.. ఫాలో అయ్యేది పవన్ కల్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, విశాఖపట్నం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ పాలనలో ప్రశాంతంగా ఉందన్నారు సజ్జల.. చంద్రబాబు హయాంలోనే ఘోరాలు జరిగాయని విమర్శించారు. విశాఖకు రాజధాని రాకుండా చేయాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు.. టీడీపీ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు ఎంత ఉండేవో అందరికి తెలుసన్న ఆయన.. చంద్రబాబు మాట్లాడే మాటలు విజన్ లా ఉన్నాయా..? అని దుయ్యబట్టారు. చిన్న పిల్లలు మాట్లాడితే పెద్దవాళ్ళు నవ్వుకున్నట్లు ఉన్నాయి చంద్రబాబు మాటలు అంటూ సెటైర్లు వేసిన ఆయన.. టార్చ్ లైట్ టెక్నాలజీని తానే కనిపెట్టాను అంటాడు.. తనని తాను తిట్టుకోవాల్సింది పోయి జగన్ ని తిడుతున్నారు అంటూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కాగా, విశాఖలో మరోసారి ఎన్నికల పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. కొత్త ప్రభుత్వం జనసేన – బీజేపీనా? లేక జనసేన – టీడీపీ – బీజేపీ ప్రభుత్వమా? ఏదైనా సరే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, భవిష్యత్ లో ఎన్డీఏ ఎలా ఉంటుందన్నది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు పాలకులను బాధ్యులుని చేస్తాం అనిపవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే.
నేను అంత తొందరగా రాజకీయాల నుంచి పోను..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట 2వ ఏఎన్ఎమ్ లు సర్వీస్ క్రమబద్దీకరణ కోరుతూ.. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. 2వ ఏఎన్ఎమ్ ల ఉద్యోగలను క్రమబద్దికరించి వారి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 2023 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. మీ అండదండలతోఉద్యోగాలు క్రమబద్ధీకరించే వరకు పోరాడుతాను అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తెలిపారు. 2023 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్న నేను సంవత్సరం పాటు ఎమ్మెల్సీగా ఉంటాను మీకు అండగా ఉండి మీ ఉద్యోగాలు క్రమబద్దికరించే బాధ్యత నాది అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. 2023లో ఫలితాలు నాకు అనకూలంగా ఉంటే సంతోషమే.. అందుకు భిన్నంగా ఉన్న నా శాసన మండలి పదవి కాలం 2025 మార్చ్ వరకు ఉంటుంది.. మీ అండదండలతో మీకోసం పోరడుతాను అని తెలిపాడు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. రాజకీయాల నుంచి తాను అంత ఈజీగా పోయేటోడిని కాదని అన్నారు.
ఇక ఉల్లి వంతు..! పై పైకి పాకుతోన్న ధర
మొన్నటి వరకు టమోటా ధర దేశవ్యాప్తంగా సామాన్యులకు చుక్కులు చూపించింది.. కిలో టమోటా ధర రెండు వందల రూపాయాలు కూడా క్రాస్ చేసింది.. అయితే, ఇప్పుడిప్పుడే టమోటా ధర దిగివస్తుంది.. కిలో తాజా ధర రూ.50 దిగువకు పడిపోయింది.. అయితే, ఇప్పుడు ఉల్లి ధర పైపైకి కదులుతోంది.. మొన్నటి వరకు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.20 నుంచి రూ.25గా పలికిన ఉల్లి ధర కొన్ని ప్రాంతాల్లో రూ.50కి చేరువగా వెళ్తుందట.. ఈ రోజు కర్నూలు రైతు బజార్‌లో కిలో ఉల్లి ధర రూ.30 నుంచి రూ.40గా పలికింది.. ఇక, బయటి మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ. 35 నుంచి రూ.45గా పలుకుతోందని వినియోగదారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హోల్ సెల్‌లో క్వింటాల్ ఉల్లి రూ.2,800 నుంచి రూ.3000గా పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.. మరోవైపు.. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు తగ్గిందట.. సాధారణంగా ప్రతీ ఏడాది జిల్లాల్లో 45 వేల ఎకరాల వరకు ఉల్లి సాగు చేస్తూ ఉంటారు.. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు 25 వేల ఎకరాలకు మించలేదని చెబుతున్నారు.. అది కూడా కర్నూలు ఉల్లి మార్కెట్ కు రావడానికి మరికొంత కాలం పడుతుందంటున్నారు.. ఇప్పుడు కర్నూలు మార్కెట్‌కు అర కొరగా వస్తుంది ఉల్లి ధర.. వర్షాభావం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి సాగుకు రైతులు ముందుకు రాకపోవడంతో ఉల్లి సాగు భారీగా తగ్గిందంటున్నారు.
విమానంలో లైంగిక వేధింపులు.. స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్
స్పైస్‌జెట్ ఫ్లైట్ ప్యాసింజర్ విమానాల్లో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్కోసారి ప్రయాణికుడు మరో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేస్తే, కొన్నిసార్లు ఇద్దరు ప్రయాణికులు పరస్పరం ఘర్షణ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన అకృత్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానంలో మహిళలను తోటి ప్రయాణికుడు లైంగిక వేధింపులకు గురి చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. ఢిల్లీ పోలీసులకు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు నోటీసులు జారీ చేసినట్లు డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మహిళా క్యాబిన్ సిబ్బందితోపాటు, తోటి మహిళా ప్రయాణికులను లైంగిక వేధింపులకు గురిచేశాడని డీసీడబ్ల్యూ వెల్లడించింది. అనంతరం అనుచిత రీతిలో వారిని ఫొటోలు తీస్తూ వేధించాడు. అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా అందులో వారికి సంబంధించిన ఫొటోలు ఉన్నట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని దిల్లీ మహిళా కమీషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి దిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసు ఎఫ్‌ఐఆర్ కాపీని సమర్పించాలి. అలాగే, నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని అని డీసీడబ్ల్యూ నోటీసుల్లో పేర్కొంది.
కూరగాయల వ్యాపారికి భోజనం వడ్డించిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలతో కష్టాల్లో కూరుకుపోయిన కూరగాయల వ్యాపారికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన చేతులతో భోజనం వడ్డించారు. ఇటీవల ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో పెద్దసంఖ్యలో టమాటాలు కొనేందుకు వచ్చిన రామేశ్వర్… అక్కడి ధరలు చూసి టమాటాలు కొనలేకపోయాడు. టమాటాల ధరలు చూసి అతడు కన్నీటి పర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో రామేశ్వర్ ను కలుసుకునేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆజాద్ పూర్ మండీకి వెళ్లారు. ఆ సమయంలో రామేశ్వర్ అక్కడ లేడు. ఆ తర్వాత తనకోసం రాహుల్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆ కూరగాయాల విక్రేత ఉబ్బితబ్బిబయ్యాడు. తనకు రాహుల్‌ను కలుసుకోవాలనుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో, రాహుల్ గాంధీ… కూరగాయల విక్రేత రామేశ్వర్‌ను తన నివాసానికి పిలిపించారు. అతడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు, డైనింగ్ టేబుల్‌పై అతడితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. “మీ హృదయం నుండి మాట్లాడటం బలహీనత కాదు, అది నిజాయితీ. ఇతరులు చెప్పేదాని గురించి ఆలోచించకండి. మీరు సత్యానికి మాత్రమే కట్టుబడి ఉంటారు” అని రాహుల్ గాంధీ రామేశ్వర్‌తో అన్నారు. భారతదేశపు వాణిని వినిపించి పోరాటాలకు సహకరించడం మనందరి నైతిక బాధ్యత అంటూ ఆ వీడియోను రాహుల్ గాంధీ పంచుకున్నారు. వారి సమావేశం నుంచి కొన్ని హృదయాలను కదిలించే క్షణాలను వీడియో క్యాప్చర్ చేసింది. లంచ్ టేబుల్ వద్ద రాహుల్ గాంధీ వారికి వడ్డిస్తున్నప్పుడు రామేశ్వర్, అతని భార్య కలిసి కూర్చున్నారు. “ఆమె (నా భార్య) ఈరోజు ఉపవాసం ఉంది” అని రామేశ్వర్ తెలియజేశాడు. రాహుల్ గాంధీ ఆమెకు పండ్లు తీసుకోవడానికి అనుమతి ఉందా అని త్వరగా ఆరా తీసి, ఆమె కోసం కొంత తీసుకుంటానని చెప్పారు.
ఆధార్ అప్‌డేట్‌పై యూఐడీఏఐ వార్నింగ్.. ఇలా చేస్తే అంతే..!
దేనికైనా ఆధార్ కార్డు నంబరే ఆధారంగా తయారైంది పరిస్థితి.. ఇక, ఎప్పటికప్పుడు ఆధార్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI).. పదేళ్లు దాటితో ఆధార్ తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సిందేనని నిర్ణయించిన విషయం విదితమే.. దీంతో కొంతమంది దగ్గరలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‌డేట్ చేసుకుంటుండగా.. మరికొందరు ఆన్‌లైన్‌లో లింక్‌లు వెతికి అప్‌డేట్ చేసుకుంటున్నారు.. పనిలో పనిగా సైబర్ నేరగాళ్లు.. ఆధార్ అప్‌డేట్ మాటున పంజా విసురుతున్నారట.. దీంతో.. అప్రమత్తమైన UIDAI.. ఆధార్ కార్డు హోల్డర్లకు వార్నింగ్ ఇచ్చింది.. ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి పత్రాలను షేర్ చేయవద్దని యూఐడీఏఐ వినియోగదారులను హెచ్చరించింది. మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి మీ గుర్తింపు రుజువు (POI) లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) పత్రాలను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా షేర్ చేయమని మిమ్మల్ని అడగడం లేదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా, తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసే ఉద్దేశ్యంతో వారి గుర్తింపు లేదా చిరునామా రుజువు పత్రాలను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంచుకోవద్దని ప్రజలను హెచ్చరించింది. అలాంటి అభ్యర్థలను UIDAI ఎప్పుడూ చేయదని.. ఒకవేళ అలాంటి మెసేజ్‌లు మీకు వచ్చాయంటే మోసపూరితంగా ఉండే అవకాశం ఉందని UIDAI అధికార యంత్రాంగం పేర్కొంది.
అసలు ‘ఏందిరా ఈ పంచాయితీ’?
డిఫరెంట్ కంటెంట్, అంతకుమించి డిఫరెంట్ గా టైటిల్ ఉంటేనే ఇప్పటి ప్రేక్షకులు సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరో హీరోయిన్స్ సంగతి పక్కనపెట్టి మరీ రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలకే ఓటేస్తున్నారు ఆడియన్స్. మరీ ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్‌లో తీసే సినిమాలకంటే మన ఊరి వాతావరణంలో తీసే సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. లోకల్ లాంగ్వేజ్, లోకల్ అడ్డాలనే తెగ ప్రేమిస్తున్నారని ఈ మధ్య రిలీజ్ అయి హిట్ అయిన సినిమాలను చూస్తే మనకి అర్ధం అవుతుంది. ఈ క్రమంలో నేటితరం ప్రేక్షకుల టేస్ట్‌కి అనుగుణంగా వీటన్నింటినీ కలగలుపుతూ తీసిన సినిమానే ‘ఏందిరా ఈ పంచాయితీ’. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ సినిమాతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో అందరినీ ఆకట్టుకుంది. ఊర్లో వాతావరణాన్ని, చిన్న గొడవలు, కులవృత్తులను తెలియజేసేలా కొన్ని సంకేతాలను ఇస్తూ టైటిల్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మరింత ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ‘ఏందిరా ఈ పంచాయితీ’ రూపంలో ఓ కంప్లీట్ విలేజ్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చారని అర్ధం అవుతోంది. ఊరి చివర సహజమైన వాతావరణంలో హీరో హీరోయిన్ ఓ గోడ మీద కూర్చొని ముచ్చటించుకుంటున్న సీన్ ఫస్ట్ లుక్‌గా వదిలడంతో ఈ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ గాఢమైన ప్రేమలో అస్సలు సంబంధం లేని ఎన్నో పంచాయితీలు చోటు చేసుకుంటాయని, ఈ పంచాయితీల చుట్టే ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.
బ్లాక్ శారీలో కేక పుట్టిస్తున్న హాట్ బ్యూటీ..
రీతూ చౌదరి.. ఈ భామ తన హాట్ షో తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన రీతూ చౌదరి..మొదట్లో సీరియల్ నటిగా ఈ భామ కనిపించింది.గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించింది.అయినప్పటికీ కూడా ఆమెకు ఆశించిన స్థాయి లో గుర్తింపు అయితే రాలేదు.ఆ తరువాత జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకుంది. జబర్దస్త్ లో ఈ భామ లేడీ కమెడియన్ గా ఎంతగానో ఆకట్టుకుంది. జబర్దస్త్ ద్వారా ఈ భామ తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది.అలాగే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లో కూడా మెరుస్తూ టీవీ ఆడియెన్స్ కు ఈ భామ మరింత గా దగ్గరవుతోంది.రీతూ చౌదరి సోషల్ మీడియా లో కూడా తెగ సందడి చేస్తుంది. వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల విందు చేస్తుంది.వరుసగా గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ రెచ్చగొడుతుంది.. టెంప్టింగ్ లుక్స్ తో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ ముద్దుగుమ్మ ట్రెండీ అవుట్ ఫిట్లు ధరించి కుర్రాళ్ల కు నిద్ర లేకుండా చేసింది..ప్రస్తుతం సంప్రదాయ దుస్తుల్లో కనిపించి మైమరిపిస్తుంది.తాజాగా రీతూ చౌదరి ట్రాన్స్ ఫరెంట్ బ్లాక్ శారీ లో మెరిసింది. చీరకట్టు లో ఈ యంగ్ బ్యూటీ ఎంతో బ్యూటీఫుల్ గా కనిపించింది. మత్తెక్కించే కళ్ళతో ఈ ముద్దుగుమ్మ మెస్మరైజ్ చేసింది. చీరలో కూడా హాట్ గా ఫోజులిస్తూ రెచ్చగొట్టింది.చేతులు పైకెత్తి నడుము అందాలను చూపిస్తూ మతి పోగొట్టింది.ప్రస్తుతం రీతూ చౌదరి సోషల్ మీడియా లో దాదాపు 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.మరింత ఫాలోయింగ్ పెంచుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.నెటిజన్స్ ఈ పిక్స్ చూసి ఎంతో హాట్ గా కామెంట్స్ కూడా పెడుతున్నారు.
సుదర్శన్ థియేటర్లో ప్రభాస్ అభిమానుల రచ్చ.. స్క్రీన్‌తో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం!
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోన్న క్రమంలో ప్రముఖ హీరోల ఒకప్పటి సినిమాలను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నయా ట్రెండ్ అనూహ్యంగా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోండడంతో నిర్మాణ సంస్థలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలు సూపర్ హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తున్నారని అర్ధం అవుతోంది. అలా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ యోగి కూడా చేరింది. తాజాగా యోగి సినిమా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈశ్వరి ఫిలిమ్స్ బ్యానర్ పైన తెరకెక్కిన ఈ మూవీని తాజాగా చందు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై లింగం యాదవ్ రీ-రిలీజ్ చేయగా రీ రిలీజ్ కు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు సహకారం అందించడం విశేషం. అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సుదర్శన్ థియేటర్లో యోగి సినిమా రీ రిలీజ్ సంధర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ఆయన హీరోగా నటించిన యోగి సినిమా సుదర్శన్ థియేటర్‌లో రీ రిలీజ్ అయిన క్రమంలో వివాదం చోటు చేసుకోవడంతో స్క్రీన్‌తో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు అభిమానులు. థియేటర్‌పై కూల్‌డ్రింక్ బాటిల్స్‌తో ఫ్యాన్స్ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ అంశం మీద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చి పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్క్రీన్ వద్దకు వెళ్లొద్దు అని సెక్యూరిటీ చెప్పినందుకు తాగేసి వచ్చి వారితో మాట మాటా పెరిగి థియేటర్ దగ్గర దొరికినవి దొరికినట్టు పగలకొట్టారని అంటున్నారు.