Chandrababu: మీ భవిష్యత్తుకు నేను గ్యారెంటీగా ఉంటాను అంటూ భరోసా ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ.. రావులపాలెంలో ప్రజలకు ఉన్న ఉత్సాహం చూస్తుంటే వైసీపీ ఇంటికే కనిపిస్తోందన్నారు. జగన్ లాంటి వ్యక్తి మరోసారి ముఖ్యమంత్రిగా ఎంపిక కాకూడదు.. ఈ ప్రభుత్వ హయాంలో నిత్యవసర వస్తువుల ధరలు, కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. కరెంటు ఉత్పత్తి చేసి ప్రజలకు తక్కువ ధరకు అందించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యిందని మండిపడ్డ ఆయన.. కరెంటును ఉత్పత్తి చేయడంలో నూతన విధానాలను పాటిస్తే కరెంటు ధరలను తగ్గించుకోగలం అన్నారు. కరెంటు చార్జీలను తగ్గించి చూపిస్తాను అంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు.
Read Also: గుప్పెడంత మనసు జగతి ఆంటీ.. దేవుడా.. ఇంత హాట్ గా ఉందేంటిరా బాబు
ఇక, మద్యంలో నాసిరకం బ్రాండ్లను దింపి సామాన్యడి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు చంద్రబాబు.. గంజాయి మత్తులో యువత భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. సిగ్గులేని ముఖ్యమంత్రి వీటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో దుర్మార్గుడైన ముఖ్యమంత్రి వల్ల గంజాయి వాణిజ్య పంటగా మారిందని ఆరోపించారు. మరోవైపు.. జొన్నాడ నుంచి రోజుకు 400 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. వందల కోట్ల రూపాయల విలువచేసే ఇసుక అక్రమంగా తరలించే స్తున్నారు. వైసీపీ నేతలు సిగ్గులేని మనుషులు అంటూ ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాలలో కోతలు పెట్టి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. సంక్షేమ పథకాలు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ఈ దుర్మార్గుడి వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది నష్టపోతున్నారు. మీ భవిష్యత్తుకు నేను గ్యారెంటీగా ఉంటాను అంటూ భరోసా ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.