Onion Price: మొన్నటి వరకు టమోటా ధర దేశవ్యాప్తంగా సామాన్యులకు చుక్కులు చూపించింది.. కిలో టమోటా ధర రెండు వందల రూపాయాలు కూడా క్రాస్ చేసింది.. అయితే, ఇప్పుడిప్పుడే టమోటా ధర దిగివస్తుంది.. కిలో తాజా ధర రూ.50 దిగువకు పడిపోయింది.. అయితే, ఇప్పుడు ఉల్లి ధర పైపైకి కదులుతోంది.. మొన్నటి వరకు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.20 నుంచి రూ.25గా పలికిన ఉల్లి ధర కొన్ని ప్రాంతాల్లో రూ.50కి చేరువగా వెళ్తుందట.. ఈ రోజు కర్నూలు రైతు బజార్‌లో కిలో ఉల్లి ధర రూ.30 నుంచి రూ.40గా పలికింది.. ఇక, బయటి మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ. 35 నుంచి రూ.45గా పలుకుతోందని వినియోగదారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read Also: Flight: విమానంలో లైంగిక వేధింపులు.. స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్
హోల్ సెల్‌లో క్వింటాల్ ఉల్లి రూ.2,800 నుంచి రూ.3000గా పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.. మరోవైపు.. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు తగ్గిందట.. సాధారణంగా ప్రతీ ఏడాది జిల్లాల్లో 45 వేల ఎకరాల వరకు ఉల్లి సాగు చేస్తూ ఉంటారు.. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు 25 వేల ఎకరాలకు మించలేదని చెబుతున్నారు.. అది కూడా కర్నూలు ఉల్లి మార్కెట్ కు రావడానికి మరికొంత కాలం పడుతుందంటున్నారు.. ఇప్పుడు కర్నూలు మార్కెట్‌కు అర కొరగా వస్తుంది ఉల్లి ధర.. వర్షాభావం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి సాగుకు రైతులు ముందుకు రాకపోవడంతో ఉల్లి సాగు భారీగా తగ్గిందంటున్నారు.