అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉచిత ఇసుక విధానం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. దీంట్లో భాగంగా ఈ పిటిషన్ సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో రిప్లై వాదనలు వినిపించారు.
ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురి అవుతున్నారు.
తిరుమలలో ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవలు రద్దు చేసిన టీటీడీ తెలిపింది. ఇక, తిరుమలలో ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 1వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి.
మన్యం జిల్లాలో సాగునీటి, తాగునీటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు అని ఆమె విమర్శలు చేశారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలి.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా దీవించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ కార్డులో క్యూ ఆర్ కోడ్, లద్ధిదారుని ఫోటో, లబ్ధిదారుని ఆరోగ్య వివరాలు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
నేడు ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్లపై విచారణ జరగనుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ కేసుల విచారణ ప్రారంభం అవుతుంది. ఇసుక పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని.. దాంతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడిందని చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు ఫైల్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకోనున్నారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు మహిళా వర్సిటీలో నిర్వహించనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు.