HPV vaccination: గర్భాశయ క్యాన్సర్లకు చెక్.. దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సినేషన్..
- కేంద్రం కీలక నిర్ణయం..
- త్వరలో దేశవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్..
- 14 ఏళ్లు, పైబడిన బాలికలకు ఉచితంగా టీకా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HPV vaccination: కేంద్ర ప్రభుత్వం నారీ సంరక్షణ కోసం అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ‘‘స్వస్థ నారీ మిషన్’’ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు కలిగిన బాలికల కోసం HPV (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. గర్భాశయ క్యాన్సర్లు (Cervical Cancer)పై కేంద్రం యుద్ధం ప్రకటిస్తూ.. దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనుంది. 14 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన బాలికలందరికీ ఈ టీకా ఇవ్వనున్నారు.
ఉచితంగానే ఈ వ్యాక్సిన్‌ను కేంద్రం అందించనుంది. ప్రైవేట్ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ‘‘గార్డసిల్’’ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. ఈ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్, క్యాన్సర్‌కు ప్రధాన కారణమయ్యే HPV టైప్స్ 16, 18 తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లను కలిగించే టైప్స్ 6, 11 నుండి రక్షణ ఇస్తుంది. 14 ఏళ్ల లోపు బాలికలకు ఇచ్చే సింగిల్ డోస్ కూడా భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా అద్భుత రక్షణ ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: Keralam: కేరళ ఇకపై ‘కేరళం’.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్!
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా శిక్షిణ పొందిన మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఉంటుంది. టీకా వేసిన తర్వాత తలెత్తే అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ను నిర్వహించడానికి ప్రత్యేక వ్యవస్థల్ని సిద్ధం చేశారు.
ఇది కేవలం వ్యాక్సినేషన్ డ్రైవ్ మాత్రమే కాకుండా, భారత దేశ చరిత్రలో మహిళలకు, పిల్లల కోసం చేపట్టిన అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. కేంద్ర ఆరోగ్య శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖలు కలిసి దీనిని నిర్వహించబోతున్నాయి. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతీ బాలికకు ఈ వ్యాక్సిన్ అందేలా కేంద్ర చర్యలు తీసుకోనుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!